Asian Games | ఆసియా గేమ్స్‌లో (Asian Games) భారత్ ఏడో పతకాన్ని సొంతం చేసుకున్నది. రోయింగ్ (Rowing) పురుషుల ఫోర్ ఈవెంట్లో (Men’s Four team Event) కాంస్య పతకం (Bronze Medal) లభించింది. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్‌లతో కూడిన జట్టు 6:10.81 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిలిచింది. ఇదే విభాగంలో 6:04.96 సెకన్లతో ఉబ్జెకిస్థాన్ స్వర్ణం గెలుపొందగా, 6:10.04 సెకన్లతో చైనా రజతం సొంతం చేసుకున్నది. దీంతో రోయింగ్‌లో నాలుగు పతకాలు వచ్చినట్లయింది. నిన్న రోయింగ్‌లో రెండు కాంస్యాలు, ఒక రజతం వచ్చిన విషయం తెలిసిందే.
కాగా, ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్యాలతో (మొత్తం 7 మెడల్స్) పతకాల పట్టికలో భారత్ 6 స్థానంలో నిలిచింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్‌తో కూడిన జట్టు 1893.7 పాయిట్లు నమోదుచేసి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది.
Many congratulations to our Rowing Team on winning the #BronzeMedal in the Men’s Four event.
Let’s #Cheer4india 🇮🇳 #WeAreTeamIndia | #IndiaAtAG22 pic.twitter.com/TKPU3vEH7V
— Team India (@WeAreTeamIndia) September 25, 2023