David Warner : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్ మరోసారి టీ20 లీగ్స్‌లో సందడి చేయనున్నాడు. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో తన ప్రతాపం చూపించిన డేవిడ్ భాయ్ త్వరలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడనున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడుపోని వార్నర్ పీఎస్ఎల్లో తన ప్రతాపం చూపేందుకు సిద్ధమవుతున్నాడు. అది కూడా కెప్టెన్‌గా.
కరాచీ కింగ్స్ యాజమాన్యం ఈ డాషింగ్ బ్యాటర్‌ను నూతన సారథిగా ఎంపిక చేసింది. పాక్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్ స్థానంలో వార్నర్‌ను నాయకుడిగా నియమిస్తున్నట్టు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఈ విషయాన్ని సోమవారం కరాచీ కింగ్స్ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
David Warner appointed as Karachi Kings’ Captain for #HBLPSLX
Read more here ⬇️https://t.co/THVFir5iwM pic.twitter.com/YMHnkZsO3X
— Karachi Kings (@KarachiKingsARY) March 24, 2025
ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్.. వంటి టీ20 లీగ్స్‌లో రికార్డులు బద్ధలు కొట్టిన వార్నర్ అనుభవం కరాచీ కింగ్స్‌కు ఎంతో ఉపయోగపడనుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆసీస్ స్టార్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కరాచీ జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో బలమైన లైనప్ ఉంది. పదో సీజన్లో ఆ టీమ్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించేందుకు నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని వార్నర్ అన్నాడు. పీఎస్ఎల్ 10వ సీజన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది.