IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పవర్ హిట్టర్లు చెలరేగిపోతున్నారు. క్రీజులోకి రావడమే ఆలస్యం బౌండరీలతో వీరంగం సృష్టిస్తున్నారు. సోమవారం వైజాగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచేశారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఊచకోత కోశారు. దాంతో, లక్నోనిర్ణీతో ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఆది నుంచి ఢిల్లీ బౌలర్లను ఉతికారేసిన 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపటిల్స్ బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్ మిచెల్ మార్ష్(72.. నికోలస్ పూరన్(75)లు అర్థ శతకాలతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(27 నాటౌట్) సిక్సర్లతో విజృంభించి స్కోర్ 200 దాటించాడు.
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్(15) శుభారంభం ఇచ్చారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన మార్ష్.. ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. స్టార్క్ వేసిన రెండో ఓవర్లో రెచ్చిపోయిన మార్ష్ వరుసగా 4, 6, 4 బాదాడు. ఈ జోడీని విడదీసేందుకు విప్రజ్కు బంతి ఇచ్చిన అక్షర్ ఫలితం రాబట్టాడు. లాంగాఫ్‌లో మర్క్రమ్ గాల్లోకి లేపిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న స్టార్క్ ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, 46 వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది.
Innings break!
Mitchell Marsh and Nicholas Pooran guide @LucknowIPL to a competitive total of 209/8. 🔥
Will @DelhiCapitals be able to chase this total down? 🤔
Scorecard ▶ https://t.co/aHUCFODDQL#TATAIPL | #DCvLSG pic.twitter.com/n2tIIJrEIM
— IndianPremierLeague (@IPL) March 24, 2025
కానీ, ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(75) తన పవర్ హిట్టింగ్తో ఢిల్లీ బౌలర్లను వణికించాడు. వీళ్లిద్దరూ చెలరేగి ఆడడంతో లక్నో స్కోర్ 9 ఓవర్లకే వంద దాటేసింది. అర్ధ శతకాల అనంతరం ఇద్దరూ ఔట్కాగా.. కెప్టెన్ రిషభ్ పంత్(0)ను కుల్దీప్ డకౌట్ చేశాడు. ఆ దశలో డేవిడ్ మిల్లర్(27 నాటౌట్) జట్టు స్కోర్ 200 దాటించే బాధ్యత తీసుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అతడు స్టాండ్స్‌లోకి పంపడంతో పంత్ సేన ఢిల్లీ ముందు 209 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.