Wanindu Hasaranga : పొట్టి వరల్డ్ కప్‌లో చావు దెబ్బ తిన్న శ్రీలంక జట్టుకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రధాన కోచ్ క్రిస్ సిల్వర్హుడ్ (Chris Silverhood) వైదొలగగా.. తాజాగా ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) అభిమానులను ఆశ్చర్య పరిచాడు. భారత జట్టుతో మరో 15 రోజుల్లో సిరీస్ అనగా కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. పొట్టి ప్రపంచకప్ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సారథిగా వైదొలుగుతున్నట్టు హసరంగ తెలిపాడు. శ్రీలంక క్రికెట్ మేలు కోరే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఈ స్టార్ ఆల్‌రౌండర్ వెల్లడించాడు.
‘ఒక ఆటగాడిగా శ్రీలంక జట్టు ఎల్లప్పుడూ నా ఉత్తమ ప్రదర్శన చేస్తాను. జట్టు సభ్యులకు, కొత్త నాయకత్వానికి పూర్తి సహకారం అందిస్తాను’ అని హసరంగ తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. అతడి రాజీనామాను ఆమోదించిన లంక బోర్డు పోస్ట్ హసరంగను తమ జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా కొనసాగుతాడని తెలిపింది. అంతేకాదు ‘అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన అస్త్రంగా మాకు హసరంగ పనికొస్తాడు’ అని అంది.
National Men’s T20I Captain Wanindu Hasaranga has decided to resign from the captaincy.
READ: https://t.co/WKYh6oLUhk #SriLankaCricket #SLC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 11, 2024
పొట్టి వరల్డ్ కప్‌లో హసరంగ నేతృత్వంలోని శ్రీలంక తీవ్రంగా నిరాశ పరిచింది. ఒకే ఒక విజయంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దాంతో, కోచ్ సిల్వర్హుడ్ రాజీనామా చేయగా.. ఇప్పుడు హసరంగ సైతం కెప్టెన్సీ వదులుకున్నాడు.
అయితే వరల్డ్ కప్ సమంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు లంక క్రికెటర్లు మందు పార్టీ చేసుకున్నారనే వార్త కథనం రెండు రోజుల క్రితం పెద్ద దుమారమే రేపింది. లంక బోర్డు అవన్నీ కట్టుకథలని కొట్టిపారేసిన మరునాడే హసరంగ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం గమనార్హం. ఇక.. టీమిండియాతో జూలై 26న తొలి టీ20 ఉన్నందున ఆలోపు కొత్త సారథిని ప్రకటించే చాన్స్ ఉంది.
భారత్, శ్రీలంక జట్ల మధ్య పల్లెకెల్ స్టేడియంలో జూలై 26 న తొలి టీ20 జరుగనుంది. అదే స్టేడియంలో జూలై 27న రెండో మ్యాచ్.. ఒక్క రోజు విరామం తర్వాత మూడో టీ20 నిర్వహించనున్నారు. అనంతరం రెండు రోజుల గ్యాప్‌తో వన్డే పోరు మొదలవ్వనుంది. ఆగస్ట్ 1న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆతిథ్య జట్టును భారత్ ఢీ కొట్టనుంది. ఆగస్ట్ 4న రెండో వన్డే, ఆగస్టు 7వ తేదీన ఆఖరి వన్డే ఇదే స్టేడియంలో జరుగనున్నాయి.