అమరావతి : ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసే నైజం చంద్రబాబు (Chandrababu) ది అని మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఏనాడు ప్రజల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని ఏకైక వ్యక్తి అని ఎద్దేవా చేశారు.
వైసీపీ(YCP) పాలనలో ప్రతి విద్యార్థికి రూ.15 వేలను అమ్మ ఒడి (Amma Odi ) పథకం కింద తల్లుల ఖాతాల్లో వేసామని గుర్తు చేశారు. నాలుగేండ్లలో సుమారు రూ. 26 వేల కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మ ఒడిని మార్చి తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే ఒక్కొక్కరికి రూ. 15 వేల చొప్పున అందజేస్తామని సూపర్సిక్స్ (Super Six) మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు.
అయితే ఈ పథకాన్ని మార్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ఇచ్చిన మేనిఫెస్టోను 98 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్కు ఉంటే అమలు చేయని ఘనత చంద్రబాబుకు ఉందని ఆరోపించారు. నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడేస్తారో ప్రభుత్వం చెప్పాలని కోరారు.
Girl Missing | మూడు రోజులుగా లభ్యం కాని బాలిక ఆచూకి .. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు
Kidney Scam | మధుబాబే అసలు సూత్రధారి.. కిడ్నీ రాకెట్ వివాదంలో మధ్యవర్తి కీలక ఆరోపణలు