Kidney Scam | మధుబాబే అసలు సూత్రధారి.. కిడ్నీ రాకెట్ వివాదంలో మధ్యవర్తి కీలక ఆరోపణలు
Kidney Scam | ఏపీలో సంచలనంగా మారిన విజయవాడ కిడ్నీ రాకెట్ వివాదంపై మధ్యవర్తి వెంకట్ స్పందించాడు. కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చి తనను మోసం చేశారని గార్లపాటి మధుబాబు చేసిన ఆరోపణలు ఆవాస్తవమని తెలిపారు.
Kidney Scam | ఏపీలో సంచలనంగా మారిన విజయవాడ కిడ్నీ రాకెట్ వివాదంపై మధ్యవర్తి వెంకట్ స్పందించాడు. కిడ్నీ అమ్మితే రూ.30 లక్షలు ఇస్తానని చెప్పి.. రూ.1.10 లక్షలు మాత్రమే ఇచ్చి తనను మోసం చేశారని గార్లపాటి మధుబాబు చేసిన ఆరోపణలు ఆవాస్తవమని తెలిపారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మధుబాబే అసలు నేరస్తుడు అని ఆరోపించారు.తాను సూత్రధారి అన్నట్లు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు.
తాను ఎలాంటి కిడ్నీ దందాలు చేయడం లేదని మధ్యవర్తి వెంకట్ స్పష్టం చేశాడు. పథకం ప్రకారమే మధుబాబు ఇదంతా చేస్తున్నాడని ఆరోపించాడు. డాక్టర్‌ను బెదిరించి డబ్బులు తీసుకోవాలని చూస్తున్నాడని తెలిపాడు. తాను ఏ తప్పు చేయలేదని.. కావాలంటే విచారణ చేసుకోవాలని సూచించాడు. తాను లీగల్ గైడ్‌లైన్స్, అఫిడవిట్ మాత్రమే చూస్తానని తెలిపారు. అవసరమైన సలహాలు ఇస్తాను.. అందుకు 20 నుంచి 30 వేలు తీసుకుంటానని తెలిపారు.
తాను ఎవరినీ డోనర్స్‌గా ప్రమోట్ చేయట్లేదని వెంకట్ తెలిపారు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడా జోక్యం చేసుకోనని చెప్పారు.. మధుబాబుకు అడ్వాన్స్‌గా లక్షా పది వేలు టెస్టుల కోసమే ఇచ్చామని తెలిపారు. ఆరేడు నెలల పాటు ఈ మొత్తం వ్యవహారం నడించిందని తెలిపారు. ఆపరేషన్‌కు ముందు రూ.7లక్షలు ఇచ్చారని.. మొత్తంగా 8.10 లక్షలు తీసుకున్నారని చెప్పారు. ధైర్యం సరిపోక తాను ఇన్నిరోజులు బయటకు రాలేదని తెలిపారు.
మధుబాబు వెర్షన్ ఇదీ..!
గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు చిన్నపాటి వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా తర్వాత ఆర్థికంగా చితికిపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్‌గా మారాడు.. కానీ గతంలో చేసిన అప్పులు మాత్రం తీర్చలేని దుస్థితిలో ఉండిపోయాడు. ఇలాంటి సమయంలోనే బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో మధుబాబుకు పరిచయమయ్యాడు. కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా గతంలో అలాగే ఓ కిడ్నీ అమ్మేసుకున్నానని నమ్మబలికాడు. దీంతో మధుబాబు కూడా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయం బాషాకు చెప్పడంతో అతను వెంకట్ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు.
వెంకట్ ద్వారా కిడ్నీ అమ్ముకుంటే రూ.30 లక్షలు ఇస్తాడని బాషా నమ్మబలికాడు. దీంతో వెంకట్ అడిగిన వివరాలన్నీ మధుబాబు చెప్పాడు. కొద్ది నెలల పాటు నెలవారీ ఖర్చులు కూడా వెంకట్ ఇచ్చాడు. ఈ క్రమంలో గత నెల 15వ తేదీన విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి మధుబాబుకు ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నాడు. దాన్ని వేరే వ్యక్తికి సెట్ చేశారు. ఆపరేషన్ తర్వాత మధు బాబుకు ఒప్పందం ప్రకారం రూ.30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 1.10 లక్షలు మాత్రమే ఇచ్చారు. అదేంటి మిగిలిన డబ్బులు ఇవ్వాలని మధుబాబు అడగ్గా.. వెంకట్ తన నిజస్వరూపం బయటపెట్టాడు. పేషెంట్ స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావు.. నీకు డబ్బులు ఎందుకివ్వాలని మధుబాబును ఎదురు ప్రశ్నించాడు. నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్ శరత్‌బాబు, మధ్యవర్తులపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేశాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారడంతో హోం మంత్రి స్పందించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

