Girl Missing | మూడు రోజులుగా లభ్యం కాని బాలిక ఆచూకి .. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు
Girl Missing | ఏపీలోని నంద్యాల జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య సంచలనం కలిగిస్తోంది.
అమరావతి : ఏపీలోని నంద్యాల జిల్లా ( Nandyala district) లో బాలిక అత్యాచారం, హత్య సంచలనం కలిగిస్తోంది. ముగ్గురు మైనర్లు ఎనిమిదేళ్ల బాలిక (Girl) పై లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడి హత్య చేసి కాలువలో పడేయగా ఆ బాలిక ఆచూకి కోసం మూడురోజులుగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్(NDRF) సిబ్బంది, విజయవాడ నుంచి గజ ఈతగాళ్లను రప్పించి కాలువలో ముమ్మురంగా గాలింపు చర్యలు ప్రారంభించారు.
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎల్లాల గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక ఆదివారం అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా దీంతో వారు బాలికను అత్యాచారం, హత్య చేసి హంద్రీనీవా(Handrinevaa) సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్ కాలువలో పడవేసామని అంగీకరించారు.
అదే రోజు సాయంత్రం నుంచి పోలీసులు కాలువలో ముమ్మరంగా గాలించారు. బాలిక జాడ తెలియకపోవడంతో గురువారం అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, విజయవాడ నుంచి రప్పించిన గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వేర్వేగా ఘటనా స్థలానికి చేరుకుని బాధిత తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
నంద్యాల జిల్లా ఎసీప రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసుల అదుపులో ఉన్న వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read more |
విజయవాడ కిడ్నీ రాకెట్లో ఐదుగురిపై కేసు నమోదు
AP News | అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య.. డీకంపోజ్ స్థితిలో మృతదేహం
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

