హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు ఐదుగురిపై కేసునమోదు చేశారు. బాషా, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్‌బాబు, కిడ్నీ స్వీకరించిన వెంకటేశంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మధుబాబు అనే యువకుడికి విజయవాడకు చెందిన బాషా సోషల్ మీడియాలో పరిచయమయ్యా డు.
మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికి ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీసుకున్నా రు. ఆపరేషన్ తర్వాత మధుబాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 1.10 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బు అడిగేసరికి స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్టు సంతకం చేశావని, మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లే దంటూ బాషా బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితు డు డాక్టర్ శరత్‌బాబు, బాషాపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.