Drunk Teachers | మధ్యప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి.. మద్యం తాగి స్కూళ్లకు వస్తున్న ప్రభుత్వ టీచర్లు
Drunk Teachers | ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ దుస్థితి నెలకొన్నది.
భోపాల్: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి రోజూ మద్యం సేవించి వస్తున్నారు. (Drunk Teachers) స్కూళ్లలో మత్తులో జోగుతున్నారు. రెండు మూడు గంటలు ఉండి వెళ్లిపోతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు చదువు సాగడం లేదు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ దుస్థితి నెలకొన్నది. గిరిజనులు అధికంగా ఉండే దిండోరి జిల్లాలోని మెహద్వానీ బ్లాక్‌లో ప్రతి రోజూ 15 మందికిపైగా ఉపాధ్యాయులు మద్యం తాగి ప్రభుత్వ స్కూళ్లకు హాజరవుతున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా మత్తులో జోగుతున్నారు. రెండు, మూడు గంటల తర్వాత స్కూల్స్ నుంచి వెళ్లిపోతున్నారు. దీంతో తమ చదువులు సాగడంలేదని విద్యార్థులు వాపోతున్నారు.
కాగా, జిల్లాలోని ప్రభుత్వ స్కూల్స్ టీచర్ల ప్రవర్తనపై బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) ఒక రిపోర్ట్‌ను తయారు చేశారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో 15 మంది ఉపాధ్యాయులు తరచూ మద్యం మత్తులో క్లాస్‌లకు హాజరవుతున్నారని ఆరోపించారు. కొంత మంది టీచర్ల పేర్లు కూడా పేర్కొన్నారు. వీరి వల్ల గిరిజన ప్రభుత్వ స్కూళ్లలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. మద్యం సేవించి స్కూళ్లకు వచ్చే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

