IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా.. యువకెరటం నేహల్ వధేరా(70) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు పడినా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(30)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. డెత్ ఓవర్లలో ఆఖర్లో శశాంక్ సింగ్(59 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్జాయ్(21 నాటౌట్) విధ్వంసంక బ్యాటింగ్‌తో అలరించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఈసీజన్లో జోరు మీదున్న ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(9)ను తక్కువ స్కోర్‌కే ఔట్ చేసిన తుషార్ దేశ్‌పాండే రాజస్థాన్‌కు రెండో ఓవర్లోనే బ్రేకిచ్చాడు. కాసేపటికే ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన మిచెల్ ఓవెన్(0)ను క్వెనా మఫాకా డకౌట్ చేశాడు.
Innings break!
A crucial partnership between Nehal Wadhera and Shashank Singh help #PBKS set a total of 219/5 on the board 🤜🤛
Can the home side chase this down or will it be defended? 🤔
Scorecard ▶ https://t.co/HTpvGewE3N #TATAIPL | #RRvPBKS pic.twitter.com/G4VywXLsxn
— IndianPremierLeague (@IPL) May 18, 2025
అయినా సరే ప్రభ్‌సిమ్రన్ సింగ్(0) దూకుడుగా ఆడాడు. శ్రేయాస్ అయ్యర్(30) జతగా పంజాబ్ స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. దేశ్‌పాండే మరోసారి షాకిస్తూ ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్ చేశాడు. దాంతో, పవర్ ప్లే 3.1 ఓవర్‌కే పంజాబ్ కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది.
దేశ్‌పాండే విజృంభణతో34కే మూడు కీలక వికెట్లు పడిన పంజాబ్‌ను అయ్యర్, నేహల్ వధేరా(70)లు ఆదుకున్నారు. క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచిన ఇద్దరూ బౌండరీలతో హడలెత్తించారు. దాంతో, 10 ఓవర్లకు పంజాబ్ స్కోర్ 97కు చేరింది. అయితే.. దంచికొడుతున్న అయ్యర్.. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వత గేర్ మార్చిన వధేరా.. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో రెండో ఫోర్లతో అర్ధ శతకం సాధించాడు.
Time to defend the score! 💪🏻 pic.twitter.com/tBHFUlSfDQ
— Punjab Kings (@PunjabKingsIPL) May 18, 2025
ఈ సీజన్లో రాజస్థాన్‌పై ఈ చిచ్చరపిడుగుకు ఇది రెండో ఫిఫ్టీ. ప్రమాదకరంగా మారిన వధేరాను ఆకాశ్ ఔట్ చేయగా రాజస్థాన్ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్(21 నాటౌట్), శశాంక్ సింగ్(59 నాటౌట్)లు ధనాధన్ ఆడారు. మఫాకా వేసిన 18 ఓవర్లో అజ్మతుల్లా రెచ్చిపోయాడు. 4, 6, 4 బాది 16 పరుగులు పిండుకున్నాడు. అనంతరం ఆకాశ్‌కు చుక్కలు చూపిస్తూ బౌండరీ బాదాడు అజ్మతుల్లా. 20 ఓవర్లో 6, 4 తో కలిపి 17 రన్స్ రావడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 219 రన్స్ చేసింది.