IPL 2025 : ఐపీఎల్ 59వ లీగ్ మ్యాచ్‌లో ఆదిలోనే మూడు వికెట్లు పడినా.. పంజాబ్ పుంజుకుంది. పవర్ ప్లేలోనే విధ్వంసక ఓపెనర్లు పెవిలియన్ చేరినా. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(26) రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ.. బౌండరీలతో చెలరేగుతున్నాడు. ఐపీఎల్లో 300 ఫోర్ల మైలురాయికి చేరుకున్నాడు.
ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(21) ఔటయ్యాక.. కుర్రాడు నేహల్ వధేరా(37)తో కలిసి 50 ప్లస్ భాగస్వామ్యం నెలకొల్పాడు అయ్యర్. హసరంగ వేసిన 10వ ఓవర్లో వధేరా సిక్సర్ బాదడంతో పంజాబ్ స్కోర్ 100కు చేరువైంది. 10 ఓవర్లకు పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.
Tushar Deshpande and Kwena Maphaka strike with early wickets for @rajasthanroyals 🔥@PunjabKingsIPL slowly building back. #PBKS 67/3 after 7 overs
Updates ▶ https://t.co/HTpvGewE3N #TATAIPL | #RRvPBKS pic.twitter.com/qFO4fnlSEN
— IndianPremierLeague (@IPL) May 18, 2025
ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే. ధాటిగా4 ఆడుతున్న ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(9)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేసి రాజస్థాన్‌కు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే అరంగేట్రం చేసిన మిచెల్ ఓవెన్(0)ను క్వెనా మఫాకా డకౌట్ చేశాడు. ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ప్రభ్‌సిమ్రన్ సింగ్(0ను దేశ్‌పాండే వెనక్కి పంపడంతో, పవర్ ప్లేలోనే పంజాబ్ కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ ఆచితూచి ఆడుతూ స్కోర్‌బోర్డును నడిపిస్తున్నాడు.