Virat Kohli: వికిపీడియాలోనూ ‘కింగే’.. టాప్ పాప్ సింగర్‌ను దాటేసి అగ్రస్థానానికి..
Most Viewed Pages by Asian in 2023 : క్రికెట్ ఆడుతున్నంత కాలం ఈ ఆటలో గానీ, సోషల్ మీడియా క్రేజ్‌లో గానీ, బ్రాండ్ల విషయంలో గానీ కోహ్లీకి సరితూగే ఆడగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు. తాజాగా ఇది మరోసారి ప్రూవ్ అయింది.
Most Viewed Pages by Asian in 2023 : ‘ప్రాణాలతో ఉన్నంతవరకూ వాడెక్కడున్నా రాజేరా’.. బాహుబలిలో ప్రభాస్ క్యారెక్టర్‌ను ఉద్దేశిస్తూ బిజ్జలదేవ (నాజర్) చెప్పే డైలాగ్ ఇది. టీమిండియా అభిమానులు ‘కింగ్’ అని పిలుచుకునే విరాట్ కోహ్లీకి ఈ డైలాగ్ అతికినట్టు సరిపోతుంది. క్రికెట్ ఆడుతున్నంత కాలం ఈ ఆటలో గానీ, సోషల్ మీడియా క్రేజ్‌లో గానీ, బ్రాండ్ల విషయంలో గానీ కోహ్లీకి సరితూగే ఆడగాడు దరిదాపుల్లో కూడా లేడంటే అతిశయోక్తే కాదు. తాజాగా ఇది మరోసారి ప్రూవ్ అయింది. గతేడాది ఆసియా వ్యాప్తంగా వికిపీడియాలో నెటిజన్లు అత్యధికంగా చూసిన పేజీలలో కోహ్లీదే అగ్రస్థానం.
ప్రముఖ పాప్ సింగర్, దక్షిణ కొరియాకు చెందిన బీటీఎస్ జంగ్‌కుక్‌ను అధిగమించి కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. గతేడాది కోహ్లీ తన ఫామ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లాడు. మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్లో కూడా సరికొత్త రికార్డులను నెలకొల్పాడు.
Virat Kohli’s Wikipedia page is the most viewed pages by Asian in 2023.
– King Kohli, The 🐐..!!!! pic.twitter.com/UaCRc1ivEO
— CricketMAN2 (@ImTanujSingh) January 1, 2024
2023లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో కోహ్లీ 2,048 పరుగులతో రెండో స్థానం (ఫస్ట్ ప్లేస్‌లో గిల్ – 2,154) లో ఉన్నాడు. ఇందులో ఏడు సెంచరీలు (ఐదు వన్డే శతకాలు) ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ – నవంబర్‌లో భారత్ వేదికగానే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ.. తన విశ్వరూపం చూపాడు. వన్డే వరల్డ్ కప్‌లోనే సచిన్ 49 సెంచరీ(వన్డేలలో) ల రికార్డును చెరిపేసి 50వ శతకం కూడా పూర్తి చేశాడు. ఐపీఎల్లో 14 మ్యాచ్‌లు ఆడి 53.25 సగటుతో 639 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు అర్థ శతకాలున్నాయి. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సచిన్ సెంచరీల రికార్డును బ్రేక్ చేసినప్పుడు వికిపీడియాలో కోహ్లీ గురించి ఎక్కువమంది సెర్చ్ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

