Virat Kohli | టీమ్ఇండియా (Team India) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) మైదానంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. సూపర్ – 4 మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ క్రమంలో ‘వాటర్ బాయ్’ (Water Boy) అవతారమెత్తాడు. మ్యాచ్ మధ్యలో జట్టు ఫీల్డర్లకు వాటర్ బాటిల్స్ తీసుకెళ్తూ కనిపించాడు. ఆ సమయంలో కోహ్లీ నార్మల్‌గా వెళ్లకపోగా.. వెరైటీగా పరుగులు తీస్తూ కనిపించాడు. దీంతో అక్కడున్న కెమెరాలన్నీ ఒక్కసారిగా కోహ్లీవైపుకు మళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరోవైపు, ఆసియాకప్‌లో (Asia Cup 2023) టీమ్ఇండియాకు తొలి పరాజయం ఎదురైంది. టోర్నీలో అప్రతిహత విజయాలతో తుదిపోరుకు చేరిన రోహిత్ సేన శుక్రవారం చివరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భారీ మార్పులు చేసింది. వర్క్ లోడ్‌ను దృష్టిలో పెట్టుకొని విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిచ్చింది. వారి స్థానాల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్‌కృష్ణ, షమీ జట్టులోకి వచ్చారు. మరోవైపు శ్రేయస్ మూడో మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.
Virat Kohli the water boy 😜♥️#ViratKohli𓃵 #INDvsBAN #AsiaCup2023 pic.twitter.com/jBElz6Ykdp
— Sahid Pathan (@Sahidpathan69) September 15, 2023
Also Read..
Singer | సంగీత కచేరీలో ప్రముఖ గాయనిపై నోట్ల వర్షం.. వీడియో
Anand Mahindra | ఎరుపు రంగు డబుల్ డెక్కర్ బస్సులపై ఎమోషనల్ ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా