ఢిల్లీ: కొంతకాలంగా పేలవ బ్యాటింగ్‌తో సతమతమవుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విరాట్ కోహ్లీ.. దేశవాళీలో ఆడాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు డిమాండ్లు చేస్తున్న విషయం తెలిసిందే. 2012 నుంచి కోహ్లీ దేశవాళీలో ఆడలేదు.
కాగా తాజాగా కోహ్లీ పేరును 22 మంది సభ్యులతో కూడిన ఢిల్లీ రంజీ జట్టులో చేర్చినా అతడు దానిని వినియోగించుకునే అవకాశాలు తక్కువే ఉన్నాయి. సిడ్నీ టెస్టు సమయంలో తన మెడ నరాలు పట్టేయడంతో ప్రస్తుతం అందుకు చికిత్స తీసుకుంటున్నానని, రంజీ మ్యాచ్ ఆడలేనని డీడీసీఏకు కోహ్లీ తెలిపినట్టు సమాచారం.