Virat Kohli : భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈమధ్యే అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏండ్లు పూర్తి చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో రికార్డు బ్రేకర్‌గా నిలిచిన విరాట్ మళ్లీ బ్రేక్ తీసుకున్నాడు. రంజీ ట్రోఫీ నుంచి విరామం దొరకడంఓ మళ్లీ ఈ రన్ మెషీన్ ఫ్యామిలీ టైమ్ గడుపుతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత మళ్లీ లండన్ విమానం ఎక్కిన విరాట్ అక్కడ సాధారణ పౌరుడిలా బతికేస్తున్నాడు. తాజాగా కోహ్లీ లోకల్ ట్రైన్ (Local Train)ఎక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
లండన్ వీధుల్లో కుమారుడు ‘అకాయ్'(Akay)ను భుజాన ఎత్తుకొని కూరగాయలు కొంటూ.. ఒంటరిగానే రోడ్డు దాటుతూ కోహ్లీ సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇప్పుడు లండన్‌లో కోహ్లీ లోకల్ ట్రయిన్ ఎక్కుతున్న వీడియో నెట్టింట తెగ తిరుగుతోంది. అందులో అతడు కారు దిగి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అందరు ప్రయాణికుల మాదిరిగానే వరుసలో నిల్చొని.. రైలు రాగానే చకాచకా వెళ్లి ఎక్కాడు.
Virat Kohli Spotted in London, Few days back🤍#ViratKohli pic.twitter.com/8dlZkcvkoR
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) August 21, 2024
ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఇంగ్లండ్(England)తో టెస్టు సిరీస్ సమయంలోనే అనుష్క శర్మ(Anushka Sharma) రెండో బిడ్డకు జన్మనిచ్చేందుకు లండన్ వెళ్లింది. దాంతో, కోహ్లీ కూడా వ్యక్తిగత కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పి ఆమెతో ఉండిపోయాడు. అక్కడే విరాట్, అనుష్కల రెండో సంతానం ‘అకాయ్’ పుట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ ఉండడంతో కోహ్లీ ఫ్యామిలీతో భారత్ వచ్చాడు.
వరల్డ్ కప్ ముగిసిందో లేదో మళ్లీ లండన్‌లో వాలిపోయాడు. కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) అభ్యర్థనతో శ్రీలంక సిరీస్ కోసం వచ్చిన విరాట్.. ఎప్పటిలానే తన కుటుంబాన్ని కలిసేందుకు యూకే వెళ్లాడు. ఇదంతా చూస్తుంటే.. కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు లండన్‌ను తమ రెండో ఇల్లుగా మార్చుకున్నారా? అని అభిమానులకు సందేహం కలుగుతోంది. తనను ఎవరూ గుర్తు పట్టని చోట ప్రశాంతంగా బతికేస్తున్న కోహ్లీ త్వరలోనే స్వదేశం రానున్నాడు. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు సిరీస్ కోసం అతడు భారత్‌కు రానున్నాడు.