అమరావతి : ఏపీలో సంచలనంగా మారిన అగ్రి గోల్డ్ (Agrigold Case ) భూముల కొనుగోలు కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్(Jogi Rajeev)కు శుక్రవారం బెయిల్ (Bail) మంజూరయ్యింది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈనెల 13న ఏసీబీ అధికారులు (ACB Officials) జోగి రాజీవ్‌ను అదుపులోకి అరెస్టు చేశారు.
ఈ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసులోనే ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడితో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజీవ్ పలుమార్లు కోర్టుల్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం బెయిల్‌పై మరోసారి విచారణ జరుగగా అందుకు న్యాయమూర్తి కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
కాగా చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి రాజీవ్ తండ్రి , మాజీ మంత్రి జోగి రమేశ్‌పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. జోగి రమేశ్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. పిటిషన్‌పై సెప్టెంబర్ 3న తీర్పు వెలువరిస్తామని కోర్టు వెల్లడించింది.