Virat Kohli | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా (Team India) ఆసియాకప్‌లో సాధికారిక విజయం సాధించింది. సోమవారం జరిగిన ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో తమ మొదటి సూపర్ 4 మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)ను చిత్తు చేసింది. 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ఇండియా జట్టు ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది.
మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ (Rohit Sharma), శుభ్‌మన్ గిల్ తదితరులు వారు బస చేస్తున్న హోటల్లోని స్విమ్మింగ్ పూల్ (Swimming Pool)లో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కోహ్లీ, రోహిత్, జడేజా పూల్‌లో తమ డ్యాన్స్ స్కిల్స్‌ను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
A memorable victory followed by a much-deserved recovery session ahead of today’s Super 4s encounter 😃👌
Here’s a quick round-up of #TeamIndia‘s remarkable win over Pakistan in Colombo 🎥 🙌#AsiaCup2023 | #INDvPAK pic.twitter.com/h0n4yeIZbN
— BCCI (@BCCI) September 12, 2023
వర్షం కారణంగా రిజర్వ్‌డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఆదివారం 24.1 ఓవర్లలో 147/2తో మ్యాచ్ నిలిచిపోగా.. సోమవారం అక్కడి నుంచే తిరిగి ఆట ప్రారంభమైంది. అయితే మరోసారి వరుణుడు అడ్డుపడటంతో మ్యాచ్‌కు ఆలస్యం కాగా.. ఆ తర్వాత కోహ్లీ (94 బంతుల్లో 122 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (106 బంతుల్లో 111; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగుల సునామీ సృష్టించారు. ప్రపంచంలోనే ప్రమాదకర పేస్ దళంగా గుర్తింపు సాధించిన పాక్ బౌలర్లను ఈ ఇద్దరూ చెడుగుడాడుకున్నారు. తొలి రోజు ఓపెనర్లు రోహిత్ (56), గిల్ (58) అర్ధశతకాలు సాధిస్తే.. రెండో రోజు కోహ్లీ, రాహుల్ అజేయ శతకాలతో పాక్‌పై విరుచుకుపడ్డారు. పాక్ బౌలర్లలో షాహిన్, షాదాబ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 32 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఫఖర్ జమాన్ (27), సల్మాన్ (23), ఇఫ్తిఖార్ (23) తలా కొన్ని పరుగులు చేయగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (10), ఇమామ్ (9), రిజ్వాన్ (2), షాదాబ్ (6), ఫహీమ్ అష్రఫ్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read..
Nipah | కేరళలో నిఫా వైరస్ కలకలం.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
Manipur Violence | మళ్లీ హింస.. ముగ్గురు గిరిజనులను కాల్చి చంపిన నిషేధిత ఉగ్రవాదులు