Rashmika | టాలీవుడ్‌కి ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందానా ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన అందం, నటన, చిలిపితనంతో అభిమానులను అలరిస్తున్న రష్మిక తన తాజా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేమలోని సంక్లిష్టత, భావోద్వేగాలను అద్భుతంగా చూపుతూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటోంది.
రష్మిక నటన, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ మీద సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ సినిమా రష్మిక కెరీర్లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని టాక్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నారని సమాచారం. దీంతో నిశ్చితార్థం తర్వాత తొలిసారి ఈ ఇద్దరు స్టార్లు ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే “విజయ్–రష్మిక మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?” అంటూ ట్రెండ్స్ మొదలయ్యాయి.
ఇక తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, ఒక నెటిజన్ “మీరు ప్రభాస్‌తో ఎప్పుడు నటిస్తారు?” అని అడగగా, ఆమె స్పందిస్తూ.. “నాకు కూడా ప్రభాస్‌తో పని చేయాలనే కోరిక ఉంది. ఆయన అద్భుతమైన నటుడు. ఆయనతో నటించే అవకాశం దొరికితే నా కెరీర్ మరో లెవెల్‌కి వెళ్తుందని నమ్ముతున్నా” అని చెప్పింది. ఈ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. ఇక ‘గీత గోవిందం’, ‘భీష్మ’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి హిట్స్‌తో టాప్ రేంజ్ హీరోయిన్గా ఎదిగిన రష్మికకు ఈ చిత్రం మరో సాలిడ్ సక్సెస్‌గా మారుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా, నవంబర్ 7న విడుదల కానున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రష్మికకు కెరీర్ మైలురాయిగా, అభిమానులకు ఎమోషనల్ లవ్ జర్నీగా నిలవబోతోందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.