హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక 60వ ఐజీఎఫ్ఆర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్షిప్ ఆదివారం అట్టహాసంగా మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ చాంపియన్షిప్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ ప్లేయర్లు పోటీపడుతున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే రోటరీ క్లబ్ ఇంటర్నేషణల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటారియన్స్(ఐజీఎఫ్ఆర్) సహకారంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, బౌల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్, వూటీ గోల్ఫ్ కౌంటీల్లో ఈ చాంపియన్షిప్ జరుగనుంది.