ముంబై: న్యూజిలాండ్‌తో జరగబోయే రెండు టెస్టులకు టీమిండియా జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలి టెస్టుకు రెస్ట్ ఇచ్చారు. రెండవ టెస్టుకు తిరిగి కోహ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే రెండు టెస్టులకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. రోహిత్‌తో పాటు బుమ్రా, షమీ, శార్దూల్ ఠాకూర్లకు కూడా రెస్ట్ ఇచ్చారు. కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తొలి టెస్టుకు కెప్టెన్ బాధ్యతలను అజింక్య రహానే చేపట్టనున్నాడు. ఆ మ్యాచ్‌లో పుజారా వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. కాన్పూర్‌లో తొలి టెస్టు నవంబర్ 25న, ముంబైలో రెండవ టెస్టు డిసెంబర్ 3న ప్రారంభం అవుతాయి.
ఇదీ జట్టు..
రహానే, పుజారా, కేఎల్ రాహుల్, అగర్వాల్, గిల్, అయ్యర్, సాహా, కేఎస్ భారత్, ఆర్ జడేజా, అశ్విన్, ఏ పటేల్, జే యాదవ్, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, పీ కృష్ణలు ఉన్నారు.
#TeamIndia squad for NZ Tests:
— BCCI (@BCCI) November 12, 2021
A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna
*Virat Kohli will join the squad for the 2nd Test and will lead the team. pic.twitter.com/FqU7xdHpjQ