Virat Kohli | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (Australia ODI Series)కు ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో.. అప్పుడే మనం ఓడిపోయినట్లు’ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే టెస్ట్‌లు, టీ20ల నుండి రిటైర్ అయిన ఈ స్టార్ 2027 వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగుతారా..? లేక మధ్యలోనే రిటైర్ అవుతారా..? అన్న చర్చ నడుస్తోంది. అక్టోబర్ 19న పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఆడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది.
The only time you truly fail, is when you decide to give up.
— Virat Kohli (@imVkohli) October 16, 2025
ఇదిలా ఉండగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగనున్నది. భారత జట్టు ఈ నెల 15న రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్తుంది. బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రాకరం.. మొదటి బృందంలో ఆటగాళ్లు ఉదయం విమానంలో బయలుదేరి వెళ్తారు. రెండో బృందం సాయంత్రం వెళ్తుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ల లభ్యత, ప్రయాణ ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చాలా రోజుల తర్వాత కోహ్లీ భారత జట్టు తరఫున మైదానంలోకి బరిలోకి దిగుతుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘వెల్కమ్ బ్యాక్ కింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
Also Read..
పతక పోరుకు తన్వి, ఉన్నతి, రక్షిత
నేటి నుంచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
భారత్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్.. ఆతిథ్య నగరం అహ్మదాబాద్!