హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 15: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో అండర్-23 జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు గురువారం తెరలేవనుంది. ఈనెల 18వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 937 మంది ప్లేయర్లు పోటీకి దిగగుతున్నారు.
వీరిలో 553 మంది బాలురు, 274 మంది బాలికలు, వంద మంది అంతర్జాతీయ అథ్లెట్లు, 150 మంది టెక్నికల్ సిబ్బంది భాగం కానున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ రాజేశ్వర్రావు, కార్యదర్శి సారంగపాణి వెల్లడించారు. వివిధ రాష్ర్టాల నుంచి డ్రాఫ్ట్ చేయబడిన సాంకేతిక అధికారులు, ఏఎఫ్ఐ, ఫొటో ఫినిష్ అధికారులు, లైవ్ స్ట్రీమింగ్ సిబ్బంది పాల్గొనబోతున్నట్లు తెలిపారు.