e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Virat Kohli : భార‌త్, పాక్ మ్యాచ్ వేళ‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డ్‌

Virat Kohli : భార‌త్, పాక్ మ్యాచ్ వేళ‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డ్‌

ఇవాళ భార‌త్ మాత్ర‌మే కాదు.. యావ‌త్ ప్ర‌పంచం భార‌త్‌, పాక్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. నిజానికి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు. దానికంటే ఎక్కువ‌. ఇత‌ర క్రికెట్ మ్యాచ్‌ల‌కు, భార‌త్‌, పాక్ మ్యాచ్‌కు చాలా తేడా ఉంటుంది. ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచ‌మే ఎదురు చూస్తోందంటే ఈ మ్యాచ్ ఎంత హైఓల్టేజ్ ఉన్న మ్యాచో అర్థం చేసుకోవ‌చ్చు.

ఓవైపు భార‌త్, పాక్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌రోవైపు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. క్రికెట్ స్టేడియాల్లోనే కాదు సోష‌ల్ మీడియాలో కూడా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన మూడో అథ్లెట్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

- Advertisement -

ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌టి మూడు స్థానాల్లో క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఉండ‌గా ఇప్పుడు నెయ్‌మర్ జూనియ‌ర్‌కు స‌మానంగా ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకొని జాయింట్‌గా మూడో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌స్తుతం 163 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారు. నెయ్‌మ‌ర్‌కు కూడా అంతే ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఇక‌.. పోర్చుగ‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ క్రిస్టియానో రొనాల్డోకు 359 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. లియోనెల్ మెస్సీ 277 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

ఈసంవ‌త్స‌రం మార్చిలో కోహ్లీ 100 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ క్ల‌బ్‌లో చేరిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఆ త‌ర్వాత 150 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్న మొద‌టి ఏషియ‌న్ సెల‌బ్రిటీగా చ‌రిత్ర‌కెక్కాడు. ఆ త‌ర్వాత ఇప్పుడు టాప్ 10 ఫాలోవ‌ర్స్ ఉన్న అథ్లెట్స్‌లో స్థానం సంపాదించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Ind vs Pak T20 World Cup : పాక్‌తో మ్యాచ్ అంటే ఆ ప్లేయ‌ర్ ఉండాల్సిందే: దినేశ్ కార్తీక్‌

Ind vs Pak | ‘రాహుల్‌ ఈ మ్యాచ్‌ ఆడకు.. మహీ ఇదొక్కటి వదిలెయ్‌’.. పాక్ అభిమానుల వేడుకోలు!

Sand Art: నేటి భార‌త్‌-పాకిస్థాన్ మ్యాచ్‌పై ప‌ట్నాయ‌క్ సుంద‌ర‌ సైక‌త శిల్పం

Ind Vs Pak | పాక్‌పై పరుగులు చేయడం కోహ్లీకి చాలా ఇష్టం.. వెల్లడించిన చిన్ననాటి కోచ్

Ind Vs Pak | గెలవాలంటే భారత ఆటగాళ్లకు నిద్రమాత్రలు ఇవ్వండి.. షోయబ్ అక్తర్ సలహా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement