Virat Kohli | ఐపీఎల్-18 సీజన్‌ను గెలుపుతో ఆరంభించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. శుక్రవారం చెన్నెలోని చిదంబరం స్టేడియం (Chidambaram Stadium) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు.. 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చెపాక్ మైదానంలో సీఎస్కేపై 17 ఏళ్ల తర్వాత విక్టరీ అందుకున్న ఆర్సీబీ సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఈ విజయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్, టీమ్ఇండియా పరుగులు రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ఆర్సీబీ ఆటగాళ్లంతా గెలుపును ఎంజాయ్ చేశారు. సెలబ్రేషన్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కోహ్లీ సహా ఇతర ఆటగాళ్లంతా డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆర్సీబీ ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ వీడియోలో కోహ్లీ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
A win so special, it got King Kohli grooving… 😍
This team! The vibes! We’re loving it. ❤
🎧: Hanumankind (Run it Up)#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #CSKvRCB pic.twitter.com/qmjASYMVFf
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 29, 2025
చెన్నైని చెన్నైలో ఓడించాలని 17 ఏండ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కల ఎట్టకేలకు నెరవేరింది. ఐపీఎల్ మొదటి (2008) సీజన్ తర్వాత బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను చిదంబరం స్టేడియంలో తొలిసారి మట్టికరిపించింది. శుక్రవారం చెపాక్ వేదికగా (chepauk stadium) చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ.. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 196/7 పరుగుల భారీ స్కోరు చేసింది. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. భారీ ఛేదనలో చెన్నై.. బ్యాటింగ్ వైఫల్యంతో 20 ఓవర్లలో 146/8కే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. రజత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Also Read..
RCB | బెంగ తీరింది.. 17 ఏండ్ల తర్వాత చెపాక్‌లో బెంగళూరుకు తొలి విజయం
IPL 2025 | ఆర్సీబీ ఆల్‌రౌండ్ షో.. సూపర్ కింగ్స్ కంచుకోటలో ఘన విజయం