Virat Kohli | విరాట్ కోహ్లీని ఎవరైన తక్కువగా అంచనా వేస్తే రియాక్షన్ వెంటనే ఉంది. పరుగుల వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ, చెన్నై తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ నడిచింది. చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కోపంతో ఊగిపోయాడు. పతిరణ వేసిన బంతి నేరుగా కోహ్లి హెల్మెట్‌కు బలంగా తగిలింది. బాడీ అటాక్‌గా పతిరణ బౌన్సర్ విసరడంతో షాట్‌కి ప్రయత్నించడంతో అది మిస్సయ్యి కోహ్లి హెల్మెట్‌కు తగిలింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్ 11వ ఓవర్లో సీఎస్కే బౌలర్ మతీష పతిరానా ఏకంగా విరాట్ కోహ్లీ తలకే గురిపెట్టి బౌన్సర్లు సంధించాడు. ఆ ఓవర్లో ఫస్ట్ బాలే కోహ్లీ హెల్మెట్‌కు చాలా బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ కూడా నిర్వహించారు. పతిరానా వేసిన ఆ డెడ్లీ బౌన్సర్ నేరుగా కోహ్లీ హెల్మెట్ ముందు భాగంలో చాలా బలంగా తాకిన కోహ్లీ మాత్రం గాయపడిన సింహంలా కసితో కనిపించాడే తప్ప ఫీల్డ్ వదిలి వెళ్లలేదు. కోపంతో తర్వాతి వేసిన అలాంటి బాల్ని ఏకంగా స్క్వౌర్ లెగ్ పైనుంచి సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. ఇలా ఆ ఓవర్లో ఫస్ట్ బాల్ హెల్మెట్‌కు తాకడంతో కోహ్లీ ఇగో హర్ట్ అయినట్లు అనిపించింది.
మూడో బంతిని కూడా బౌండరీ బాదేందుకు ప్రయత్నించగా అది ఎడ్జ్ తీసుకుంది. దాంతో సింగిల్ వచ్చింది. వరుసగా మూడో బౌండరీ బాదేందుకు ప్రయత్నించగా అది మిస్సవ్వడంతో కోహ్లి గట్టిగా అరిచేశాడు. ఆ తర్వాతి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ పటిదార్ బౌండరీగా మలిచాడు. ఈ ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లతో కలిపి మొత్తం 16 పరుగులు వచ్చాయి. పడుకున్నోడిని లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా 30 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో కోహ్లీ 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. స్టార్టింగ్‌లో కాస్త స్ట్రగుల్ అయిన కోహ్లీ.. పతిరానా చేసిన పనికి టచ్‌లోకి వచ్చి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే భారీ షాట్‌కి ప్రయత్నించి ఔటయ్యాడు.
VIRAT KOHLI HITS 6,4 vs PATHIRANA AFTER HIT ON HELMET.
– The GOAT. 🐐pic.twitter.com/LXVFWaKoKO
— Tanuj (@ImTanujSingh) March 28, 2025