IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండో విజయం సాధించింది. 17 ఏళ్లుగా చెపాక్ స్టేడియంలో ఓడిపోతూ వస్తున్న ఆర్సీబీ ఎట్టకేలకు జయభేరి మోగించింది. రజత్ పాటిదార్(51) మెరుపులకు జోష్ హేజిల్‌వుడ్(3-21), యశ్ దయాల్(2-18) సూపర్ బౌలింగ్ తోడవ్వడంతో సీఎస్కేకు ఓటమిని రుచిచూపింది. ఆది నుంచి తడబడిన చెన్నై జట్టు 197 పరగుల ఛేదనలో 146కే పరిమితం అయింది. తొలి ఐపీఎల్ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న బెంగళూరు మరింత ఆత్మవిశ్వాసం మూటగట్టుకుంది.
సొంతమైదానంలో సింహంలా గర్జించే చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ఛేదనలో సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. తన మొదటి ఓవర్లోనే హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీసి సీఎస్కేను దెబ్బకొట్టాడు. మొదట ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(5)ను.. ఆఖరి బంతికి రుతురాజ్ గైక్వాడ్(0)ను డకౌట్‌గా డగౌట్‌కు చేర్చాడు. దాంతో, 8 పరుగులకే ఆతిథ్య జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ రచిన్ రవీంద్ర(41) ఆత్మవిశ్వాసంగా ఆడాడు.
They continue to make merry with the ball 👌👌
3⃣ important wickets in the powerplay 🙌#CSK 31/3 after 6 overs.
Updates ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @RCBTweets pic.twitter.com/A01w52aN33
— IndianPremierLeague (@IPL) March 28, 2025
అయితే. భువనేశ్వర్ బౌలింగ్‌లో రివ్యూ తీసుకొని దీపక్ హుడా(4)లు వికెట్ సాధించింది బెంగళూరు. ఆ తర్వాత వచ్చిన సామ్ కరన్(4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఇంప్యాక్ట్ ప్లేయర్ శివం దూబే(22) హడలెత్తించినా.. యశ్ దయాల్ తన 13వ ఓవర్లో డేంజరస్ రచిన్, దూబే.. ఇద్దరినీ బౌల్డ్ చేసి సీఎస్కేను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. దాంతో, 13 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 81-6. కాసేపటికే అశ్విన్(1) కూడా ఔట్ కావడంతో సీఎస్కే ఓటమి ఖాయమైంది. ఆఖర్లో.. జడేజా(25), ధోనీ(30)లు ధాటిగా ఆడారు. 20వ ఓవర్లో ధోనీ రెండు సిక్సర్లు, ఫోర్ బాదినా జట్టును గెలిపించలేకపోయాడు.
A never ending story 😊
Last over 🤝 MS Dhoni superhits 🔥
Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r
— IndianPremierLeague (@IPL) March 28, 2025
చెపాక్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ కొట్టింది. కెప్టెన్ రజత్ పాటిదార్(51) సూపర్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పాటిదార్ విరాట్ కోహ్లీ(31)తో విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(32), టిమ్ డేవిడ్(22)లు ధనాధన్ ఆడారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో 4, 4, 6 బాదడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.
ఆ తర్వాత నూర్ అహ్మద్ విజృంభణతో విరాట్, లివింగ్‌స్టోన్ పెవిలియన్ చేరారు. పాటిదార్, కృనాల్ పాండ్యాలు వెనువెంటనే ఔటయ్యారు. సామ్ కరన్ వేసిన 20వ ఓవర్లో టిమ్ డేవిడ్ (22 నాటౌట్ ) రెచ్చిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది ఆర్సీబీ స్కోర్ 190 దాటించాడు. నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.