బెంగళూరు: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్ చేర్చడం మంచి పరిణామమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 1900 తర్వాత రానున్న లాస్ఎంజిల్(2028) ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు. శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అతను మాట్లాడుతూ ‘ఒలింపిక్ చాంపియన్‌గా నిలువడమనేది మరిచిపోలేని అనుభూతి.
విశ్వక్రీడల్లో క్రికెట్‌ను చేర్చడానికి ఐపీఎల్ ఎంతగానో దోహదపడింది. ఐపీఎల్ ప్రపంచంలోనే ప్రముఖ లీగ్‌గా వెలుగొందుతూ ఒలింపిక్స్ స్థాయికి చేరడంలో కీలకమైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు యువ క్రికెటర్లకు మంచి అవకాశం’ అని అన్నాడు. తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు విరాట్ కోహ్లీ చెక్ పెట్టాడు. ‘ఏం నిరుత్సాహ పడకండి. రిటైర్మెంట్పై నేను ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ప్రస్తుతానికి బాగుంది’ అని పేర్కొన్నాడు.