Virat Kohli : లండన్‌ను తన రెండో ఇల్లుగా మార్చుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ స్వదేశం వచ్చేశాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం భార్యాబిడ్డలను చూసేందుకు వెళ్లిన విరాట్ సొంతగడ్డపై అడుగుపెట్టాడు. న్యూజిలాండ్ (Newzealand) తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రన్ మెషీన్ ముంబై విమానాశ్రయంలో కెమెరా కంట పడ్డాడు.
నలుపు రంగు టీషర్ట్, బూడిద రంగు ప్యాంట్.. కళ్ల జోడు, టోపీ ధరించిన కోహ్లీ ఫొటోలకు ఫొజిస్తూ కాసేపు సందడి చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. కోహ్లీతో పాటు అతడి భార్య అనుష్కా శర్మ, పిల్లలు వామికా, అకాయ్లు కూడా ముంబై వచ్చారని సమాచారం.
Along with Virat Kohli, Anushka Sharma and kids have also comeback to Mumbai from London 😍🔥 pic.twitter.com/MY2YxuVrkJ
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 11, 2024
అంతర్జాతీయ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన కోహ్లీ ఎందుకనో.. టెస్టు క్రికెట్లో మాత్రం వెనకబడ్డాడు. ఫ్యాబ్-4లోని జో రూట్ (Joe Root) వరుస శతకాలతో చెలరేగిపోతుంటే.. విరాట్ మాత్రం 29వ సెంచరీ వద్దే ఆగిపోయాడు. బంగ్లాదేశ్‌పై విఫలమైన కోహ్లీకి 30వ సెంచరీతో చరిత్ర సృష్టించేందుకు న్యూజిలాండ్ సిరీస్ ఓ అద్భుతమైన అవకాశం. సుదీర్ఘ ఫార్మాట్‌ను ఎంతో ఇష్టపడే కోహ్లీ.. శతక గర్జనతో అభిమానులను అలరించాలని యావత్ భారతవాని కోరుకుంటోంది.
On this day in 2019, Virat Kohli scored his 7th Double Century vs SA and completed 7K test runs.
He was playing on 254* but he chose to declare the innings without thinking about his triple century! 🫡🔥 pic.twitter.com/SwBb2HwAAN— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 11, 2024
టీమిండియా సొంతగడ్డపై వరుసగా 18వ టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించింది. బంగ్లాపై సూపర్ విక్టరీతో ఈ ఘనత సొంతం చేసుకుంది. అంతేకాదు వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలిచిన రోహిత్ సేన ఇక న్యూజిలాండ్ సవాల్‌కు సిద్ధమవుతోంది.
2019 ⏩ 2024
India continue their dominance against Bangladesh in red-ball cricket 🔥#India #INDvsBAN #Tests #Cricket #RohitSharma #ViratKohli pic.twitter.com/nJLQVeQnTh
— Wisden India (@WisdenIndia) October 3, 2024
ఈమధ్యే శ్రీలంక చేతిలో చావు దెబ్బతిన్న కివీస్ మూడు టెస్టుల సిరీస్ కోసం భారత పర్యటనకు వస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అక్టోబర్ 16వ తేదీన మొదటి టెస్టు జరుగనుంది. ఇరుజట్లు అక్టోబర్ 23న రెండో టెస్టు, నవంబర్ 1వ తేదీన మూడో టెస్టులో తలపడనున్నాయి.