ముంబై: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(Navi Mumbai Airport) నిర్మాణం తుది దశకు చేరుకున్నది. ఇవాళ ఆ విమానాశ్రయంలో విజయవంతంగా ట్రయల్ ల్యాండింగ్ నిర్వహించారు. భారతీయ వైమానిక దళానికి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్.. ఆ విమానాశ్రయం రన్‌వేపై దిగింది. వచ్చే ఏడాది ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ295 విమానం ఇవాళ రన్‌వేపై ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ విమానం వాటర్ సెల్యూట్ చేశారు. ఆ తర్వాత సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించారు.
గ్రీన్‌ఫీల్డ్ నవీ ముంబై విమానాశ్ర నిర్మాణాన్ని .. 2021లో అదానీ గ్రూపు ప్రారంభించింది. భారత చరిత్రలో ఇది తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా నిలువనున్నది. అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ డైరెక్టర్ జీత్ అదానీ.. తన ఎక్స్ అకౌంట్లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ ట్యాండింగ్ జరగడం గర్వంగా ఉందన్నారు. ట్రయల్ ల్యాండింగ్ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, కేంద్ర మంత్రి మురళీధర్ మోహుల్ హాజరయ్యారు.
A historic moment for Navi Mumbai as we celebrate the first landing on the new airport with the Indian Air Force’s C-295! Grateful for the support of @IAF_MCC , including a stunning low pass by the Su-30. This marks the dawn of a new era in Indian aviation, where the sky is no… pic.twitter.com/gxdJma94Ed
— Jeet Adani (@jeet_adani1) October 11, 2024