Nitish Kumar Reddy : జాతీయ జట్టుకు ఆడాలనేది అతడి చిన్న్పటి కల. దేశవాళీలో బ్యాటుతో, బంతితో అద్భుతాలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ తన తడాఖా చూపించాడు. ఇంకేముంది.. ‘ఓ ప్రతిభావంతుడా.. రావయ్యా జట్టులోకి’ అంటూ సెలెక్టర్లు అవకాశమిచ్చారు. కాన్పూర్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో నీలి రంగు జెర్సీ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) ఒంటి మీదకు వచ్చేసింది. అంతే.. దేశం తరఫున ఆడాలనే అతడి కల సాకారమైంది. ఆక్షణం అతడి తండ్రి ముత్యాల రెడ్డి (Mutyala Reddy) ఎంతో పొంగిపోయాడు.
ఎందుకంటే.. కుమారుడు దేశం తరఫున ఆడుతుంటూ చూడాలని ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు ఆయన. తండ్రి త్యాగాన్న మర్చిపోని నితీశ్.. అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ టీమిండియా జెర్సీ ధరించాడు. బంగ్లాదేశ్‌పై రెండో టీ20లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన నితీశ్.. ఆ తర్వాత బంతితోనూ విజృంభించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. తొలి సిరీస్‌లోనే ఒంటిచేత్తో జట్టును గెలిపించడం.. ఏ క్రికెటర్‌కైనా చిరస్మరణీయమే కదా.
NITISH KUMAR REDDY – The brute force of six hitting. 🥶 pic.twitter.com/UtDAfXbbiI
— Johns. (@CricCrazyJohns) October 9, 2024
ఐపీఎల్ హీరోగా భారత జట్టులోకి వచ్చిన నితీశ్ వాళ్లది విశాఖపట్టణం. తండ్రి ముత్యాల రెడ్డి అక్కడే హిందూస్థాన్ జింక్‌లో ఉద్యోగం చేసేవాడు. నితీశ్ ఐదేండ్ల వయసు నుంచే బ్యాట్ అందుకున్నాడు. తండ్రితో కలిసి హిందూస్థాన్ జింక్‌కు వచ్చేవాడు. అక్కడ మైదానంలో క్రికెట్ ఆడుతున్న సీనియర్లను గమనించేవాడు. అలా.. కుమారుడి ఇష్టాన్ని తెలుసుకున్న ముత్యాల రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బిడ్డ కెరీర్ కంటే ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యం కాదని రాజీనామా చేశాడు.
Meet Mutyala Reddy, a father who dared to dream big! In 2012, he left his govt job when Hindustan Zinc shut down its Vizag ops to focus on his 9-yr-old son Nitish Kumar Reddy’s sports talent.#IndvsBan #OrangeArmy pic.twitter.com/BnuQsQ1kXr
— Sunrisers Army (@srhorangearmy) October 9, 2024
‘2012లో నన్ను విశాఖపట్టణం నుంచి రాజస్థాన్‌కు బదిలీ చేశారు. ఆ సమయంలోనే నితీశ్ కెరీర్ గురించి ఆలోచించాను. నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉందని అతడి కోచ్‌లు నాతో చెప్పారు. ఆ క్షణమే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. నా బిడ్డ కెరీర్ కోసం, అతడిని క్రికెటర్‌గా చూడడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాను’ అని ముత్యాల రెడ్డి వెల్లడించాడు.
అయితే.. కొడుకును క్రికెటర్ చేయాలని ఉద్యోగం మానేశావా? అని వాళ్ల బంధువులు నవ్వుకున్నారట. కానీ, అవేమీ పట్టించుకోకండా నీతీశ్‌ను ఆయన ప్రోత్సహించారు. ముత్యాలు నమ్మకాన్ని నిజం చేస్తే నీతీశ్ 2020లో ఆంధ్రా జట్టు తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడుడు. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లో అదరగొట్టి జట్టుకు కొండంత అండగా నిలిచాడు. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న నితీశ్ జీవితం ఐపీఎల్‌తో ఒక్కసారిగా మారి పోయింది.
Enough of this “WE DON’T HAVE HARDIK PANDYA’s ALTERNATIVE” narrative!!
⭐️ Nitish Kumar Reddy :
– Bowls 140 KPH,
– Can bowl in death,
– Can Bat in middle,
– Can anchor the inning,
– Can be a finisher,
– Hit long sixesBring Nitish in Indian Team!pic.twitter.com/MsydQi9aq7
— Rajiv (@Rajiv1841) April 22, 2024
ఐపీఎల్ 17వ సీజన్లో నితీశ్ కుమార్ పేరు మార్మోగిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌ల తరహాలో దూకుడుగా ఆడుతూ.. బంతితోనూ ప్రత్యర్థిని దెబ్బకొట్టగల యువకెరటం దొరికాడంటూ అభిమానులు మురిసిపోయారు. ఆల్‌రౌండర్‌గా రాణించిన నితీశ్ త్వరలోనే దేశం తరఫున ఆడడం ఖాయం అనుకున్నారంతా. అనుకున్నట్టే. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు నితీశ్‌కు పిలుపొచ్చింది. అయితే.. గాయం కారణంగా అతడు దూరమయ్యాడు. ప్రతిభగల అతడికి మరో అవకాశం ఇద్దామని బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలెక్టర్లు.
కాన్పూర్‌లో డెబ్యూట్ క్యాప్ అందుకున్న నితీశ్ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేశాడు. తెలుగోడి తెగువ చూపిస్తూ తొలి అర్ధ శతకంతో వారెవ్వా అనిపించాడు. అంతేకాదు.. బౌలింగ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు.
నితీశ్ ఆట చూసిన వాళ్లంతా హార్దిక్ పాండ్యా తర్వాత మరో నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ దొరికేశాడని తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కుమారుడిపై కురుస్తున్న అభినందనల వర్షాన్ని చూసి తండ్రి ముత్యాలు తన త్యాగం వృథా కాలేందంటూ ఎంతో సంబురపడిపోతున్నాడు. పుత్రోత్సాహం అంటే ఇదేనేమో.