Manu Bhaker : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం అందాల భామలతో లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakme Fashion Week) నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ముద్దుగుమ్మలు ర్యాంపుపై తమ హొయలను ఒలికారు. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో రెండు కాంస్య పతకాలు గెలిచిన భారత షూటర్ (Indian shooter) మనూ భాకర్ (Manu Bhaker ) కూడా ఈ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొని ర్యాంప్ వాక్‌తో అదరగొట్టింది.
భారీ సంఖ్యలో ఫ్యాషన్ షోకు వచ్చిన అతిథుల మధ్య మనూ భాకర్ వయ్యారం ఒలకబోస్తూ ర్యాంప్ వాక్ చేసింది. అయితే ఈ సందర్భంగా మధ్యమధ్యలో ఆమె తన ముఖంపై పులుముకున్న నవ్వును కోల్పోయింది. ఏతో ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపించింది. ర్యాంప్ వాక్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందరి మధ్య ర్యాంప్‌పై నడవం అనేది తనకు ఇబ్బందికరంగా అనిపించిందని, దాంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాయని చెప్పింది.
#WATCH | Delhi | Olympic medallist shooter Manu Bhaker walks the ramp at Lakme Fashion Week pic.twitter.com/ozfPv0JJUT
— ANI (@ANI) October 11, 2024
#WATCH | Delhi | At the Lakme Fashion Week, Olympic medallist shooter Manu Bhaker says, “The experience was surreal, though I was nervous…” pic.twitter.com/3wOot0e8PU
— ANI (@ANI) October 11, 2024