BGT 2024-25 : బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందే భారత జట్టు (Team India)కు ఊహించని షాక్. పెర్త టెస్టు కోసం సిద్ధమవుతున్న సీనియర్ ఆటగాళ్లు గాయ పడ్డారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో పాటు కేఎల్ రాహుల్ (KL Rahul) గాయంతో మైదానం వీడాడు.
కుడి మోచేతికి బౌన్సర్ తగిలి రాహుల్ నొప్పితో విలవిలలాడాడు. వెంటనే ఫీజియో వచ్చి అతడిని పరీక్షించాడు. బ్యాటింగ్ కొనసాగించడం తన వల్ల కాదంటూ రాహుల్ బాధతోనే మైదానం బయటకు వెళ్లాడు. ‘కోహ్లీకి ఏం అయింది?’ అనే విషయం మాత్రం తెలియదు. కానీ, ఈ ఇద్దరికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఏం వచ్చింది? అనేది బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది.
KL Rahul got hit on the elbow by a rising Prasidh Krishna delivery and had to retire out in a match simulation at the WACA 🤕
Virat Kohli got a few cover drives away before nicking to second slip 👉 https://t.co/WWsWeBORP4#AUSvIND pic.twitter.com/nfwnEquaBA
— ESPNcricinfo (@ESPNcricinfo) November 15, 2024
ఆస్ట్రేలియా గడ్డపై ఎలాగైనా చెలరేగి ఆడాలనే కసితో ఉన్న విరాట్ గాయంతోనే కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాడు. అయితే.. నొప్పి కారణంగా ఏకాగ్రతగా ఆడలేక ఔటయ్యాడు. న్యూజిలాండ్ (Newzealand) టెస్టు సిరీస్‌లో విఫలమైన విరాట్‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చాలా కీలకం. ఒకవేళ కంగారూల గడ్డపై కూడా పరుగులు చేయలేకపోతే రన్ మెషీన్ టెస్టు కెరీర్ ప్రశ్నార్ధకంలో పడ్డట్టే.
Virat Kohli scored 30* Runs after batting for an hour. Started to get in rhythm after a shaky start. [Tristan Lavalette] pic.twitter.com/7xF27Qi8QQ
— Virat Kohli Fan Club (@Trend_VKohli) November 15, 2024
ఓపెనర్‌గా ఆస్ట్రేలియా ఏ పై తేలిపోయిన రాహుల్‌కు కూడా ఈ సిరీస్ పరీక్షే. రెండోసారి తండ్రికాబోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఒకవేళ పెర్త్ టెస్టుకు దూరమైతే యశస్వీ జైస్వాల్‌కు జోడీగా ఇన్నింగ్స్ ఆరంభించేది రాహులే. అందుకని అతడు రాణించడం జట్టుకు చాలా ముఖ్యం. ఇక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ విషయానికొస్తే.. నవంబర్ 22న పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. ఐదు టెస్టుల మ్యాచ్‌లుగా జరుగనున్న ఈ టోర్నీలో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ఆడే అవకాశాలు మెరుగుపడే వీలుంది.