Vinesh Phogat : ఒలింపిక్స్ పతకం చేజార్చుకున్న భారత రెజ్లర్ వినేశ్ ఫొగొట్ (Vinesh Phogat)కు స్వదేశంలో ఊహించనిరీతిలో స్వాగతం లభించింది. ఇక సొంత ఊరు బలాలిలో పెద్దలంతా కలిసి ఓ బంగారు పతకాన్ని వినేశ్‌కు బహుమతిగా ఇచ్చారు. అదొక్కటే కాకుండా భారీ మొత్తంలో ఆమెకు కానుకలు అందాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, కొన్ని కంపెనీలు, సంస్థల నుంచి ఆమెకు 16.35 కోట్లు బహుమతిగా అందాయనే వదంతులు వైరల్ అవుతున్నాయి.
అయితే.. ఆమె భర్త సోమ్‌వీర్ రథీ (Somvir Rathee) ఎక్స్ వేదికగా స్పందిస్తూ అదొక చీప్ పబ్లిసిటీ అని అన్నాడు. ‘వినేశ్ ఫొగాట్వై వస్తున్న వార్తలన్నీ అబద్దమే. చెప్పాలంటే అదొక చీప్ పబ్లిసిటీ. వాటితో మాకు నష్టం వాటిల్లడమే కాకుండా సమాజిక విలువలకు కూడా నష్టమే. మా శ్రేయోభిలాషులకు ఓ విజ్ఞప్తి. దయచేసి అలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి’ అని సోమ్‌వీర్ తెలిపాడు.
निम्नलिखित संस्थाओं, व्यापारियों, कंपनियों और पार्टियों द्वारा विनेश फोगाट को कोई धनराशि प्राप्त नहीं हुई है. आप सभी हमारे शुभचिंतक लोग हैं, कृपया झूठी खबरें न फ़ैलाएँ. इससे हमारा नुक़सान तो होगा ही. सामाजिक मूल्यों का भी नुक़सान होगा.
यह सस्ती लोकप्रियता पाने का साधन मात्र है. pic.twitter.com/ziUaA8ct1W
— Somvir Rathee (@somvir_rathee) August 18, 2024
ఒలింపిక్ పతకం అందినట్టే అంది చేజారిన బాధలో ఉన్న వినేశ్ అపూర్వ స్వాగతంతో కాస్త కుదుటపడింది. స్వగ్రామంలో సన్మానం అనంతరం ఆమె మనసులోని మాటల్ని పంచుకుంది. ‘ఒలింపిక్ పతకం చేజార్చుకోవడం నా జీవితంలో పెద్ద గాయం. రెజ్లింగ్‌ను వదిలేస్తానా? వీడ్కోలును వాపస్ తీసుకుంటానా? అనేది ఇప్పుడే చెప్పలేను’ అని వినేశ్ అంది.
ఒలింపిక్స్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్ ఆడలేకపోయిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పేసింది. అనంతరం వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది. అయితే.. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివరకు పతకం ఇవ్వలేమని చెప్పింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది.