Ghattamaneni Jaya Krishna | దివంగత లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటవారసత్వాన్ని మహేశ్ బాబు కొనసాగిస్తున్నాడని తెలిసిందే. మరోవైపు కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు యాక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అశోక్ గల్లా కూడా యాక్టర్‌గా తన కెరీర్‌ను పరీక్షించుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. తాజాగా కృష్ణ కుటుంబం నుంచి మరో వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా..? దివంగత నటుడు రమేశ్ బాబు కుమారుడు జయ కృష్ణ (Jaya Krishna) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. నటుడుగా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందేలా పలు విభాగాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడట జయ కృష్ణ. సినిమాటిక్ ప్రయాణాన్ని మొదలుపెట్టేందుకు యూఎస్‌లో యాక్టింగ్ కోర్స్‌లో కూడా శిక్షణ తీసుకున్నాడని ఇన్సైడ్ టాక్. జయకృష్ణ తన డెబ్యూ సినిమా కోసం ప్రస్తుతం టాప్ బ్యానర్ల నుంచి కొన్ని స్టోరీలైన్స్ వింటున్నాడని తెలుస్తోంది.
కథ ఫైనల్ అవగానే సినిమాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్దమవుతాడని టాక్. ఇదిలా ఉంటే జయ కృష్ణ ఫొటోషూట్‌కు సంబంధించిన స్టిల్స్ నెటిజన్లు, మూవీ లవర్స్ అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంటున్నాయి. మరి ఘట్టమనేని కృష్ణ మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ ప్రేక్షకుల దగ్గర ఎలాంటి మార్కులు కొట్టేస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి జయకృష్ణ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కృష్ణ అభిమానులు.
Jaya Krishna Ghattamaneni is gearing up for his film debut.#JayaKrishnaGhattamaneni latest photo shoot has fans buzzing with anticipation. He looks extremely charismatic, oozing swag 🌟 #JayaKrishna pic.twitter.com/gD3yaeXbWS
— Ramesh Bala (@rameshlaus) August 19, 2024
Priyadarshi | ప్రియదర్శి నెక్ట్స్ సినిమా టైటిల్‌పై సమ్మోహనం మేకర్స్ క్లారిటీ
Stree 2 | 4 రోజుల్లోనే రికార్డ్ వసూళ్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న శ్రద్దాకపూర్ స్త్రీ 2
World Of Vasudev | కిరణ్ అబ్బవరం క నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్