Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) సంచలన ప్రకటన చేశారు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకు తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. వినేశ్ ప్రకటనతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
— Vinesh Phogat (@Phogat_Vinesh) December 12, 2025
ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా వినేశ్ పోస్టు పెట్టారు. ‘ప్యారిస్ ఒలింపిక్స్‌తో నా రెజ్లింగ్ జర్నీ ముగిసిందా అని ప్రజలు ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయాను. నేను రెజ్లింగ్ మ్యాట్, ఆ ఒత్తిడి, అంచనాల నుంచి, నా సొంత ఆశయాలకు కూడా కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇన్నేళ్లలో మొదటిసారిగా నేను కాస్త ఊపిరిపీల్చుకోగలిగాను. నా సుదీర్ఘ ప్రయాణంలోని ఎత్తుపల్లాలను అర్థం చేసుకోవడానికి నేను కొంత సమయం తీసుకున్నాను. నేను కెరీర్లో ఎన్నో ఎత్తులు చూశాను. అందులో ఈ ప్రపంచం ఎన్నడూ చూడని హృదయ విదారకర ఘటనలు, త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఓ సత్యాన్ని తెలుసుకున్నాను. నేను ఇప్పటికీ ఈ క్రీడను (wrestling) ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగాలని అనుకుంటున్నాను. ఈ సారి నేను ఒంటరిగా బరిలోకి దిగట్లేదు. నా వెంట నా కొడుకు వస్తున్నాడు. నన్ను ప్రోత్సహించేందుకు నా కొడుకు సిద్ధమయ్యాడు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో కలుద్దాం’ అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
గతేడాది పారిస్ ఒలింపిక్ గేమ్స్ (Paris Olympic Games)లో వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) అనర్హతకు గురైన విషయం తెలిసిందే. 50 కేజీల విభాగంలో 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఫైనల్ గేమ్‌కు కొద్ది క్షణాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం సర్వత్రా షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు వినేశ్ గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. జులానా స్థానం (Julana Assembly Seat) నుంచి పోటీ చేసిన ఈ స్టార్ రెజ్లర్ ఘన విజయం సాధించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు గతంలో ప్రకటించిన రిటైర్మెంట్పై వినేశ్ వెనక్కి తగ్గారు.
Also Read..
Vaibhav Sooryavanshi: 14 సిక్సర్లు, 9 ఫోర్లతో 171 రన్స్.. వైభవ్ సూర్యవంశీ ధమాకా ఇన్నింగ్స్
NZvWI: విండీస్‌పై రెండో టెస్టులో విజయం.. సిరీస్‌లో కివీస్‌కు ఆధిక్యం
Lionel Messi: కోల్‌కతాలో 70 ఫీట్ల ఎత్తైన మెస్సి విగ్రహం