వెల్లింగ్టన్: వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు(NZvWI)లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ కేవలం 128 రన్స్‌కే ఆలౌటైంది. కేవలం 56 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్.. మూడో రోజు మూడవ సెషన్‌లోపే గెలుపు నమోదు చేసింది. కివీస్ బౌలర్ జాకబ్ డఫీ 38 రన్స్ ఇచ్చి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది కివీస్. ఫస్ట్ టెస్టు మ్యాచ్ డ్రా అయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో అయిదు వికెట్లు తీసుకోవడం డఫీకి ఇది రెండోసారి. రెండో ఇన్నింగ్స్‌లో డఫీకి తోడుగా మైఖేల్ రే కూడా అద్భుతంగా బౌల్ చేశాడు. అతను 45 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో అతికష్టంగా మ్యాచ్‌ను డ్రా చేసుకున్న విండీస్ వెల్లింగ్టన్లో మాత్రం చేతులెత్తేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 73 రన్స్ వెనుకబడ్డ ఆ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో పెద్దగా స్కోరు చేయలేకపోయింది. కెవమ్ హాడ్జ్ అత్యధికంగా 35 రన్స్ చేశాడు. వచ్చే గురువారం బే ఓవల్‌లో మూడవ టెస్టు జరగనున్నది.
A clinical performance from New Zealand in the second Test against West Indies in Wellington as they open up 1-0 lead in the three-match series 💪#WTC27 | #NZvWI 📝: https://t.co/S6X98LZHV6 pic.twitter.com/GG0zGgQB8K
— ICC (@ICC) December 12, 2025