కోల్‌కతా: ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ లియోనిల్ మెస్సీ(Lionel Messi).. ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆయన కోల్‌కతా చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని లేక్ టౌన్ వద్ద సుమారు 70 అడుగుల ఎత్తైన మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ ఆ అర్జెంటీనా సూపర్‌స్టార్ విగ్రహాన్ని తయారు చేయించింది. మెస్సి విగ్రహంలో అతను ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని పట్టుకుని ఉన్నాడు. మాంటీ పౌల్స్ బృందం ఆ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గోట్ టూరులో భాగంగా మెస్సీ ఇండియా వస్తున్నారు. కోల్‌కతాతో పాటు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో మెస్సీ టూరు చేయనున్నారు. లేక్ టౌన్ వద్ద ఇనుముతో విగ్రహాన్ని రూపొందించారు. మెస్సీ కుటుంబసభ్యుల కటౌట్లు, స్టాచ్యూలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే ఇది అత్యంత ఎత్తైన మెస్సీ విగ్రహమని బెంగాల్ మంత్రి తెలిపారు.