దుబాయ్: వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) దుమ్మురేపాడు. బౌండరీలతో హోరెత్తించాడు. సిక్సర్లు, ఫోర్లతో దుబాయ్ మైదానంలో చెలరేగిపోయాడు. ఆసియాకప్ అండర్19 టోర్నీలో భాగంగా ఇవాళ యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో 171 రన్స్ చేసి ఔటయ్యాడు. వైభవ్ తన సూపరఫాస్ట్ ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. తృటిలో అతను డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 95 బంతుల్లోనే సూర్యవంశీ 171 కొట్టాడు. అండర్19 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన రెండవ ఇండియన్ బ్యాటర్‌గా సూర్యవంశీ నిలిచాడు.
తన ధమాకా ఇన్నింగ్స్‌తో వైభవ్ రికార్డులు బద్దలు కొట్టాడు. అండర్19 ఆసియాకప్‌లో అత్యధిక సంఖ్యలో ఓ ఇన్నింగ్స్‌లో సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడతను. గతంలో 2017లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ దార్విష్ రసూలీ అత్యధికంగా 10 సిక్సర్లు బాదాడు. మరో ఆసియా రికార్డును కూడా బ్రేక్ చేశాడు సూర్యవంశీ. ఆసియాకప్‌లో తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్న వైభవ్.. అత్యధిక సిక్సర్ల సంఖ్యను కూడా తన పేరిట రాసుకున్నాడు. ఆసియాకప్ అండర్19 టోర్నీలో రసూలీ ఇప్పటి వరకు 22 సిక్సర్లు బాదాడు. ఆ సంఖ్యను దాటేసిన వైభవ్ ఆ టోర్నీలో ఇప్పటికే 26 సిక్సర్లు కొట్టేశాడు.
1⃣7⃣1⃣ runs
9⃣5⃣ deliveries
9⃣ fours
1⃣4⃣ sixesVaibhav Sooryavanshi sets the tone in style for India U19 with a whirlwind knock against UAE U19 🫡👏#MensU19AsiaCup2025 pic.twitter.com/DcbhMufAxn
— BCCI (@BCCI) December 12, 2025
ఇవాళ జరుగుతున్న గ్రూప్ ఏ మ్యాచ్‌లో తాజా సమాచారం ప్రకారం ఇండియా 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. ప్రస్తుతం వేదాంత త్రివేది, విహాన్ మల్హోత్రా క్రీజ్‌లో ఉన్నారు.