Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురై వార్తల్లో నిలిచిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టనుంది. విశ్వ క్రీడల గ్రామంలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికిన ఆమె త్వరలోనే రాజకీయాల్లో(Politics)కి రానుంది. ఒలింపిక్స్ పతకం చేజారినా కోట్లాది మంది మనసులు గెలిచిన వినేశ్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ పోటీ చేయనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి.
‘అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కొన్ని రాజకీయ పార్టీలు వినేశ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఓ వార్త కథనం తెలిపింది. అయితే.. వినేశ్ ఎవరికి పోటీగా నిలబడనుందో తెలుసా.? సోదరి అయిన బబితా ఫొగాట్ (Babita Phogat)తో. దాంతో, ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని హర్యానా మీడియా కోడై కూస్తోంది.
రజతం దక్కకపోవడం యావత్ భారతాన్ని నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆగస్టు 14న అర్బిట్రేషన్ కోర్టు వినేశ్‌కు పతకం ఇవ్వడం లేదంటూ చెప్పిన చేదు వార్త ఇంకా మింగుడు పడడం లేదు. అయితే.. ఏ కారణం చెప్పకుండానే వినేశ్ ఫోగొట్కు పతకం నిరాకరించడాన్ని అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాస్ సోమవారం 24 పేజీల సుదీర్ఘ తీర్పును వెల్లడించింది.
అందులో కాస్ ఏం చెప్పిందంటే..?’ విభాగానికి సరిపోయేంత బరువు ఉండడం అనేది అథ్లెట్ల బాధ్యత అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ మినహాయింపులు ఉండవని కాస్ చెప్పింది. వినేశ్ ఫొగాట్ విషయంలోనూ తాము అదే నియమాన్ని అనుసరించామ’ని అర్బిట్రేషన్ కోర్టు తన 24 పేజీల తీర్పులో తెలిపింది.
పారిస్ ఒలింపిక్స్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. 50 కిలోల విభాగంలో అదరగొట్టిన ఆమె అలవోకగా ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే.. అనూహ్యంగా ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో అనర్హతకు గురైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పిన వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది. క్యూబా బాక్సర్తో పాటు సంయుక్తంగా తనకు రజతం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది.
అయితే.. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివరకు పతకం ఇవ్వలేమని చెప్పింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది. ఢిల్లీలో దిగిన ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. స్వగ్రామమైన బలాలిలో సన్మాన కార్యక్రమం అనంతరం వినేశ్ బంగారు పతకం అందుకున్న విషయం తెలిసిందే.