Khammam | ఏపీజీవీబీ బ్యాంక్‌కు తాళం వేసి రైతుల నిరసన
Khammam | తమకు రుణమాఫీ(Loan waiver) కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి(APGVB Bank) తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఖమ్మం : తమకు రుణమాఫీ(Loan waiver) కావడం లేదని ఆవేదన చెందిన ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన రైతులు ఏపీజీవీబీకి(APGVB Bank) తాళం వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏపీజీవీబీ బ్యాంక్ పరిధిలో సుమారు 7 గ్రామాలకు చెందిన 200 మంది రైతులు తమకు రుణమాఫీ కాలేదని ఆందోళనతో మంగళవారం బ్యాంకు వద్దకు చేరుకున్నారు. తక్షణమే రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం బేషరతుగా ఎలాంటి షరతులు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుబంధు నగదు విడుదల చేయాలన్నారు. ఏపీజీవీబీ పరిధిలోని ఒక్క గ్రామంలో కూడా 50 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం వ్యవసాయాధికారుల కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ సాధారణ రైతులను తిప్పించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ఎలాంటి ఆంక్షలు లేకుండా సాగుచేసే ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

