ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం గాదెపాడు గ్రామానికి చెందిన మొక్కపాటి రాంప్రసాద్ ఖమ్మం నుండి వస్తుండగా...
కారేపల్లి, నవంబర్ 10 : కారేపల్లి క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం గాదెపాడు గ్రామానికి చెందిన మొక్కపాటి రాంప్రసాద్ ఖమ్మం నుండి వస్తుండగా, గిద్దవారిగూడెంకు చెందిన మైనర్లు కన్నెబోయిన గణేష్, గోసి విజయ్ మరో ద్విచక్ర వాహనంపై ఖమ్మం వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు తీవ్ర గాయాలు కాగా, ఇద్దరు మైనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ధాటికి రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మైనర్లు లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడంపై కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
AP News | ఎగువ నుంచి భారీ వరద.. నీట మునిగిన సోమేశ్వర ఆలయం..!
Khet Bachao Abhiyan | ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలి.. ‘ఖేత్ బచావో అభియాన్’ లో ఏడీఏ బాబు నాయక్
‘ఏఐకేఎస్ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

