Khet Bachao Abhiyan | ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలి.. ‘ఖేత్ బచావో అభియాన్’ లో ఏడీఏ బాబు నాయక్
Khet Bachao Abhiyan | రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం మెరుగుపడుతుందని గజ్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్ వివరించారు.
Khet Bachao Abhiyan | రాయపోల్ నవంబర్ 10 : నేల ఆరోగ్య పరిరక్షణతోనే భూసారాన్ని పెంపొందించి, రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని డాక్టర్ ఎం. శాంత లక్ష్మి అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ (సాగు భూమి సంరక్షణ కార్యక్రమం)లో భాగంగా రైతులకు నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగం, పంటల సాగులో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. ఎం. శాంత లక్ష్మి , ప్రధాన శాస్త్రవేత్త, ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్, రాజేంద్రనగర్, హైదరాబాద్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకొని, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా అవసరమైన ఎరువులను మాత్రమే వినియోగించాలని సూచించారు.
రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని పెంచాలని, తద్వారా నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూసారం మెరుగుపడుతుందని వివరించారు. అదేవిధంగా విత్తనాలు విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని, దీనివల్ల విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించడంతో పాటు మొలక శాతం పెరిగి ఆరోగ్యకరమైన మొక్కలు పెరుగుతాయని తెలిపారు.
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని..
ఈ కార్యక్రమంలో గజ్వేల్ సహాయ వ్యవసాయ సంచాలకులు బాబు నాయక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో (El Niño) ప్రభావం వల్ల రబీ పంటల సాగులో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, నీటి లభ్యత తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, అవసరానికి అనుగుణంగా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని, బిందు సేద్యం మరియు తుంపర సేద్యం వంటి నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని వివరించారు.
ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, బేగంపేట గ్రామ సర్పంచ్ గీతా ప్రవీణ్, ఉపసర్పంచ్ స్వామి, గ్రామ రైతులు, ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించేలా శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని అధికారులు సూచించారు.
Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khet Bachao Abhiyan | ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలి.. ‘ఖేత్ బచావో అభియాన్’ లో ఏడీఏ బాబు నాయక్
‘ఏఐకేఎస్ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి’
చింతాబాబుకు మాదిగకు జాతీయ పురస్కారం
‘రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
Sonia Gandhi | ‘నాడు మేనక చెప్పిన ఆ అబద్దం నన్ను చాలా బాధించింది’.. ఆత్మకథలో సోనియాగాంధీ వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

