Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Priya Bhavani Shankar | తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. గత కొన్నేళ్లుగా తన ప్రియుడు రాజ్వెల్ రాజ్‌తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Priya Bhavani Shankar | తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. గత కొన్నేళ్లుగా తన ప్రియుడు రాజ్వెల్ రాజ్‌తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రియా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రియా భవానీ శంకర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ ఫోటోల్లో ఆమె సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించడంతో పాటు, మెడలో మల్లెపూల దండలు ధరించి కనిపించారు. అంతేకాకుండా చేతులకు గోరింటాకు పెట్టుకున్న ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె ఇంట్లో పెళ్లి వేడుకలకు సంబంధించిన సందడి మొదలైనట్లు అభిమానులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు ప్రారంభమైనట్లు సమాచారం. అయితే ఇవి అధికారికంగా ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటోలేనా? వివాహానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఎప్పుడు జరగనున్నాయి? అనే విషయాలపై ప్రియా నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ప్రియా భవానీ శంకర్, రాజ్వెల్ రాజ్ ప్రేమకథ విషయానికి వస్తే.. వీరిద్దరికీ కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అప్పటి నుంచి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపు పదేళ్లకు పైగా ప్రేమ ప్రయాణం సాగిస్తున్న ఈ జంట, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచుతూ వస్తోంది. ఇక 2022లోనే ఈ జంట కలిసి తమ కలల ఇంటిని కొనుగోలు చేయడం అప్పట్లో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రియా షేర్ చేసిన ఫోటోలతో ఆ ఎదురుచూపులకు తెరపడబోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రియా భవానీ శంకర్ తన ప్రియుడు రాజ్వెల్ రాజ్‌ను కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకోవాలని భావిస్తున్నారట. భారీ హంగామా లేకుండా, సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఇప్పటివరకు పెళ్లి తేదీ, వివాహ వేదికకు సంబంధించిన వివరాలను ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

