Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Varanasi | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయి కథాంశంతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Varanasi | టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించే చర్చ నడుస్తోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయి కథాంశంతో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా తెలుగు థియేట్రికల్ హక్కుల విషయంలో వినిపిస్తున్న రికార్డు స్థాయి డీల్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కే.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలని దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సాంకేతిక కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘వారణాసి’ సినిమా బిజినెస్‌కు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లోని తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కుల కోసం దాదాపు రూ.290 కోట్ల రికార్డు ధర చెల్లించినట్లు సమాచారం. ఇదే నిజమైతే తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయి థియేట్రికల్ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మహేష్ బాబుకు ఉన్న భారీ క్రేజ్, రాజమౌళి సినిమాలపై దేశవ్యాప్తంగా ఉండే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఈ చిత్రానికి ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ డీల్‌కు సంబంధించి నిర్మాతలు లేదా మైత్రి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ఇతర ప్రాంతాల థియేట్రికల్ హక్కులు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల విక్రయాల విషయంలో కూడా భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలను దర్శకుడు రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాను కేవలం భారతీయ ప్రేక్షకులకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. ఇంగ్లీష్‌తో పాటు ఇతర విదేశీ భాషల్లోనూ ‘వారణాసి’ని విడుదల చేసేందుకు గ్లోబల్ స్టూడియోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. డిజిటల్ హక్కులు, ఓవర్సీస్ బిజినెస్, ఇతర భాషల మార్కెట్ కలిపి ఈ సినిమా మొత్తం బిజినెస్ మరింత భారీ స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

