ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
ACB Case | భైంసా మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
ACB Case | లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదు.. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు ఫైల్స్ కదలాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ ఎక్కడో ఒక చోట టేబుల్ కింద చేతులు పెడుతూ అడ్డంగా బుక్కవుతున్నారు.
తాజాగా భైంసా మున్సిపాలిటీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇన్చార్జ్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జాదవ్ సంతోష్ ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. సదరు సివిల్ కాంట్రాక్టర్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న చెక్కులను విడుదల చేసేందుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాదవ్ సంతోష్ రూ.60 వేలు డిమాండ్ చేశాడు.
తొలి దఫా రూ.10 వేలు లంచం తీసుకుని 6 లక్షలకు పైగా చెక్‌ను విడుదల చేశారు. అయితే రెండో విడతలో రూ.2 లక్షలకుపైగా చెక్ ఇచ్చేందుకు ఫిర్యాదు దారుడి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని అధికారుల బృందం రెండ్‌హ్యాండెడ్‌గా జాదవ్ సంతోష్‌ను పట్టుకున్నారు. నిందితుడిని కరీంనగర్ స్పెషల్ జడ్జి (ఏసీబీ కేసులు) ముందు హాజరు పరిచి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించనున్నారు.
Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
AP News | ఎగువ నుంచి భారీ వరద.. నీట మునిగిన సోమేశ్వర ఆలయం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

