IPhone 16 Pro : ఐఫోన్ ఎస్ఈతో భారత్‌లో ఐఫోన్ల తయారీని 2017లో యాపిల్ ప్రారంభించింది. అప్పటినుంచి యాపిల్ భారత్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 13. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 తయారీని చేపట్టింది. కానీ యాపిల్ ఇప్పటివరకూ భారత్‌లో ప్రొ వేరియంట్స్ తయారీ చేపట్టలేదు. ఇక భారత్‌లో తొలిసారిగా ప్రొ మోడల్స్ తయారీ ప్రారంభించేందుకు యాపిల్ సంసిద్ధమైంది. వచ్చే నెలలో లాంఛ్ కానున్న ఐఫోన్ 16 ప్రొతో యాపిల్ భారత్‌లో ప్రొ మోడల్స్ తయారీని ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ మోడల్స్‌ను భారత్‌లో తయారుచేసేందుకు యాపిల్ ప్రణాళికలు రూపొందిస్తున్నదనే వార్తలు వచ్చాయి. 2021-22లో దేశంలో ఐఫోన్ 14 మోడల్స్ అసెంబ్లింగ్‌ను కంపెనీ ప్రారంభించింది. 2023 నాటికి భారత్‌లో తయారైన ఐఫోన్ 15 యూనిట్స్‌ను గ్లోబల్ సేల్స్ తొలి రోజుకే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత బేస్ మోడల్స్‌కే ప్రొడక్షన్ పరిమితమైంది. ఇక రాబోయే మూడు, నాలుగేండ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25 శాతం వాటా భారత్ నుంచి సమకూరాలని యాపిల్ యోచిస్తోంది.
మరోవైపు యాపిల్ కీలక భాగస్వామి ఫాక్స్‌కాన్ ఐఫోన్ 16 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడల్స్ అసెంబ్లింగ్‌ను గ్లోబల్ లాంఛ్ అనంతరం కొద్దివారాలకే అసెంబ్లింగ్ చేయాలని కసరత్తు సాగిస్తోంది. తమిళనాడులోని తన ప్లాంట్‌లో వేలాది కార్మికులకు ఈ దిశగా ఫాక్స్‌కాన్ ఇప్పటికే శిక్షణను ప్రారంభించిందని, ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 16 లాంఛ్‌కు అనుగుణంగా స్ధానిక ఉత్పత్తిని అనుసంధానించేలా ఫాక్స్‌కాన్ ప్రణాళికలు రూపొందించింది.
Read More :