Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) రాజకీయాల్లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కాంగ్రెస్‌లో చేరిన వినేశ్.. హర్యానా అసెంబ్లీ ఎన్నిక(Haryana Assembly Elections)ల్లో పోటీ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో తొలి అడుగులు వేస్తున్న ఆమె.. పనిగట్టుకొని మరీ తనను విమర్శిస్తున్న రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘బ్రిజ్ భూషణ్ ఏమీ దేశం కాదని, దేశ్ ప్రజలంతా తనవైపే ఉన్నార’ని వినేశ్ అంది.
రెజ్లర్ బజ్రంగ్ పూనియాతో కలిసి కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ తాజాగా ఓ రోడ్ షోలో పాల్గొన్నది. అనంతరం ఆమె బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘రెజ్లింగ్‌లో నేనే ఏమీ గెలిచానో దానికి ప్రజల ఆశీర్వాదమే కారణం. రాజకీయాల్లో కూడా విజయవంతం అవుతానని నమ్ముతున్నా. త్వరలోనే రెజ్లర్ల పోరాటం గురించి జంతర్ మంతర్‌లో మాట్లాడుతా.
VIDEO | Haryana Elections: “Whatever I have won in wrestling, it was because of people. Hopefully, I will be successful in this as well. I will talk about the wrestlers’ protest at Jantar Mantar later, BJP had allowed us to sit there. Brij Bhushan is not the country, people are… pic.twitter.com/5YDaGwStfT
— Press Trust of India (@PTI_News) September 8, 2024
ఇక బ్రిజ్ భూషణ్ విషయానికొస్తే.. నా దృష్టిలో అతడు లేనేలేడు. అతడేమీ దేశం కాదు. ప్రజలంతా నాకు మద్ధుతగా నిలిచారు. నేను అన్ని యుద్ధాల్లో గెలుస్తాను. భారత్‌లో అడుగపెట్టాక ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన బాధ కొంచెం తగ్గింది. రాజకీయాల పరంగా నేను ఎన్నో సవాళ్లను ఎదుర్కోబోతున్నా’ అని వినేశ్ తెలిపింది.
వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్‌లో చేరడంపై బ్రిజ్ భూషణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. రెండేండ్ల క్రితమే కాంగ్రెస్ తనపై కుట్ర చేసిందని, అప్పుడు నేను ఎంత చెప్పినా ఎవరు వినలేదని అన్నాడు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే వినేశ్, బజ్రంగ్ పూనియాలో తనకు వ్యతిరేకంగా ఉద్యమించారని భూషణ్ ఆరోపించాడు. అయితే.. అనవసరంగా వినేశ్, బజ్రంగ్లపై నోరు జారొద్దని బీజేపీ హైకమాండ్ భూషణ్‌ను హెచ్చరించింది. ఇప్పటికే చేసింది చాలు.. ఇక నోరు మూసుకొని ఉండు అని ఆ పార్టీ పెద్దలు అతడికి వార్నింగ్ ఇచ్చారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
పారిస్ ఒలింపిక్స్ 51 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్ ఫొగాట్ అనూహ్యంగా పతకం కోల్పోయింది. గోల్డ్ మెడల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో, వినేశ్ పతక కల చెదిరింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఆమె క్రీడా కోర్టులో అప్పీల్ చేసింది. కానీ, సదరు కోర్టు సైతం తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేసింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది.