Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గరపడటంతో ఓవర్సీస్లో అడ్వాన్స్ బుక్ స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే అటు అడ్వాన్స్ బుక్ స్టార్ట్ చేశారో లేదో ప్రీసేల్‌లో 5 లక్షల టికెట్లు బుక్ అయినట్లు టీమ్ ప్రకటించింది. ఇక అమెరికాతో పాటు కెనడాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతున్నట్లు చిత్రబృందం తెలపింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు దేవర టీం ప్రకటించింది. ఈ ట్రైలర్ ఈవెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
#Devara storm is unstoppable! 🌪️🔥
$500K+ USA Premiere Pre-Sales in @Cinemark Chain Alone🔥🇺🇸#DevaraUSA @tarak9999 pic.twitter.com/iaiukqQXvk
— Prathyangira Cinemas (@PrathyangiraUS) September 8, 2024