Vinesh Phogat : పారిస్ నుంచి బరువెక్కిన గుండెతో స్వదేశం వచ్చిన భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat)కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో కాలు మోపింది మొదలు సొంతూరైన బలాలి (Balali) చేరుకునేంత వరకూ వినేశ్‌కు అభిమానులు వెల్కమ్ చెప్పారు. ఇక ఇచ్చిన మాట ప్రకారమే బలాలి గ్రామ పెద్దలు ఆమెకు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు.
విశ్వ క్రీడల్లో పతం చేజార్చుకున్న వినేశ్‌కు రెజ్లర్లు బజ్రంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లు చాంపియన్ తరహాలో స్వాగతం పలికారు. అనంతరం బలాలిలో ఆమె మేనమామ మహవీర్ ఫొగాట్(Mahavir Phogat), ఖాప్ పంచాయతీ పెద్దలు వినేశ్‌కు గౌరవ మర్యాదలతో ఆహ్వానించారు. ‘ఒలింపిక్ మెడల్ గెలవకున్నా సరే.. నువ్వు ఎప్పటికీ చాంపియన్‌వే’ అంటూ ఆమెను ఘనంగా సన్మానించారు. రెజ్లర్‌ను పూల దండలు, తలపాగాతో సన్మానించిన అనంతరం వినేశ్‌కు స్వర్ణ పతకాన్ని అందజేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒలింపిక్స్ పతకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఫైనల్ ఫైట్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువుతో ఫైనల్ ఆడలేకపోయిన ఆమె కన్నీటిపర్యంతమైంది. ఆ బాధలోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు కూడా చెప్పేసింది. సీఏసీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. క్రీడలకు సంబంధించిన వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తుంటుంది.
चैंपियन बहन विनेश फोगाट आपको 140 करोड़ देशवासी स्वर्ण पदक विजेता मानते हैं।
सभी देशवासियों की तरफ से जीत का प्रतीक हनुमान जी की गदा भेंट की। @Phogat_Vinesh #वेलकम_विनेश pic.twitter.com/oRDeIQ1mw7
— Deepender S Hooda (@DeependerSHooda) August 17, 2024
అనంతరం వినేశ్ తనపై వేటు సవాల్ చేస్తూ అర్బిట్రేషన్ కోర్టు (CAS)లో అప్పీల్ చేసింది. అయితే.. మూడు సార్లు తీర్పును వాయిదా వేసిన కాస్ చివరకు పతకం ఇవ్వలేమని చెప్పింది. దాంతో, నిరాశగా వినేశ్ స్వదేశానికి వచ్చేసింది. విమానాశ్రయం దగ్గర తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులను ఉద్దేశించి వినేశ్ మాట్లాడింది. తనపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు ఫిదా అయిన ఆమె.. ‘మీ ప్రేమ ముందు వెయ్యి బంగారు పతకాలైనా తక్కువే’ అని అంది.