WI vs SA : సొంతగడ్డపై వెస్టిండీస్‌కు పెద్ద షాక్. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) ఘన విజయం సాధించి 1-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి టెస్టును అతికష్టం మీద డ్రా చేసున్న విండీస్ ఈసారి కనీస పోరాటం చేయలేదు. కగిసో రబడ(3/50), కేశవ్ మహరాజ్(3/37)ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేయగా టెయిలెండర్లు పట్టుదల ప్రదర్శించారు. అయినా సరే ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. జైడన్ సీల్స్(27)ను మహరాజ్ ఔట్ చేయడంతో 40 పరుగుల తేడాతో తెంబా బవుమా బృందం జయభేరి మోగించింది.
గయానా వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ చేజేతులా ఓడింది. 262 పరుగుల ఛేదనలో ఆదినుంచి తడబడి మ్యాచ్‌ను అప్పగించేసింది. రబడ(3/50) బుల్లెట్ బంతులతో హడలెత్తించగా.. మహరాజ్(3/37) మరోసారి తిప్పేశాడు.
Wiaan Mulder is the Player of the Match after shining with both bat and ball ⭐https://t.co/PchR2SCx8c #WIvSA pic.twitter.com/qMvRdH4zyI
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2024
దాంతో, 103కే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన వెస్టిండీస్‌ను జైడన్ సీల్స్(27), గుడకేశ్ మోతీ(45)లు ఆదుకున్నారు. వీళ్లు మొండిగా పోరాడి 77 పరుగులు జోడించారు. అయితే.. మోతీని ఎల్బీగా ఔట్ చేసిన మహరాజ్ సఫారీలకు బిగ్ బ్రేకిచ్చాడు. ఆ తర్వాత విండీస్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.
– Piedt’s 10th-wicket stand with Burger
– Mulder’s four-for and fifties from Markram, Verreynne
– Rabada, Maharaj finishing with three-forsA complete team effort from South Africa in Providence, as they beat West Indies ✨ https://t.co/PchR2SCx8c #WIvSA pic.twitter.com/dvES9dGZVx
— ESPNcricinfo (@ESPNcricinfo) August 17, 2024
తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను విండీస్ 160 కట్టడి చేసింది. అనంతరం నంద్రె బర్గర్(3/49) మల్డర్(4/32) విజృంభణతో విండీస్ కూడా కుప్పకూలింది. అయితే.. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. కైల్ వెర్రెయెన్నె(59), ఎడెన్ మర్క్రమ్(51)లు అర్ధ శతకాలతో రాణించినా మిగతావాళ్లు విఫలమయ్యారు. జైడన్ సీల్స్(6/61) ఆరు వికెట్లతో చెలరేగడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌటయ్యింది.